యూత్‌కు పర్ఫెక్ట్ వాలెంటైన్ గిఫ్ట్, iphone 17 కేవలం రూ.47,742!
వాలెంటైన్స్ డే వస్తుందంటే ప్రేమికులకు పండుగే. ఇది కేవలం ప్రియురాల, ప్రియుడు వరకే పరిమితం కాదు.. ఐఫోన్ (iPhone) అంటే పడి చచ్చే యాపిల్ లవర్స్ కు కూడా ఈ సారి ప్రేమికుల దినోత్సవం ప్రత్యేకం కానుంది. ఎందుంటే మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న ఐఫోన్ 17 ధర భారీగా తగ్గనుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా వినియోగదారులను ఆకర్షించేలా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 15 వరకు తమ స్టోర్లలో స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్స్ సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా యాపిల్ ఐఫోన్ 17 నిలుస్తోంది.

iphone 17 256 GB..
256GB స్టోరేజ్ కలిగిన యాపిల్ ఐఫోన్ 17 సాధారణంగా ₹82,900 ధర ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే సేల్ ఆఫర్‌ల కింద ఎక్స్ఛేంజ్, బోనస్‌లు, బ్యాంకింగ్ ప్రయోజనాలను కలిపితే ఈ ఫోన్‌ను కేవలం ₹47,742 ప్రభావవంతమైన ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉందని క్రోమా తెలిపింది.
పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసిన వినియోగదారులకు, మోడల్ మరియు ఫోన్ పరిస్థితిని బట్టి గరిష్టంగా ₹23,500 వరకు ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది. దీనితో పాటు అదనంగా ₹8,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా క్రోమా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ₹2,000 తక్షణ క్యాష్‌బ్యాక్, పరికరానికి నేరుగా వర్తించే ₹1,658 ప్రమోషనల్ డిస్కౌంట్ కూడా ఈ ఆఫర్‌లో భాగంగా ఉన్నాయి.
సుమారు ₹47,742..
అన్ని ఆఫర్‌లు సక్రమంగా వర్తింపజేసినప్పుడు ఐఫోన్ 17 ప్రభావవంతమైన ధర సుమారు ₹47,742కు చేరుకుంటుంది. అయితే తుది ధర నగరం, స్టోర్‌లో అమలయ్యే ధరలు, అలాగే ఎక్స్ఛేంజ్ చేయబడిన ఫోన్ మూల్యాంకనంపై ఆధారపడి మారవచ్చని క్రోమా స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, HDFC టాటా న్యూ క్రెడిట్ కార్డును ఉపయోగించే వినియోగదారులకు ఎంపిక చేసిన యాపిల్ ఉత్పత్తులపై అదనంగా 10 శాతం వరకు పొదుపు లభిస్తుంది. ఈ ప్రయోజనం నేరుగా డిస్కౌంట్‌గా కాకుండా న్యూకాయిన్‌ల రూపంలో టాటా న్యూ ఖాతాలో జమ అవుతుంది. ఈ న్యూకాయిన్‌లను టాటా న్యూ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోళ్లు లేదా సేవల కోసం వినియోగించుకోవచ్చు.
అన్ని ప్రయోజనాలు.. ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ, బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ప్రమోషనల్ డిస్కౌంట్.. పూర్తిగా వర్తించినప్పుడే ప్రకటించిన ప్రభావవంతమైన ధర సాధ్యమవుతుందని, కార్డ్ అర్హతలు మరియు నిబంధనలు వర్తిస్తాయని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో, వాలెంటైన్స్ డే సేల్‌లో ఐఫోన్ 17 వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ముఖ్యమైన డీల్‌గా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications