• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపే జైట్లీ బడ్జెట్: పోలీసుల ఆధునీకరణ.. మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు కావాలన్న హోంశాఖ

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: దేశ ఆంతరంగిక భద్రతతోపాటు సరిహద్దుల్లో సైన్యానికి బాసటగా నిలుస్తున్న హోంశాఖ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం, మిలిటెన్సీ, మావోయిస్టులు, సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సమస్యలు, అతివాదంతోపాటు ప్రక్రుతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. ఈ క్రమంలో హోంశాఖ సిబ్బందికి ఎప్పటికప్పుడు తర్ఫీదునిస్తూనే మరోవైపు నిరంతరం వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంతే కాదు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని వినియోగంపైనా శిక్షణ ఇవ్వడం.. సంప్రదాయ పద్దతుల్లో పోలీసుశాఖ విధుల నిర్వహణ కష్టతరంగా.. అసలు ఒక సవాల్‌గా, ప్రియంగా మారిందంటే అతిశయోక్తి కాదు.

పోలీసు శాఖ ఆధునీకరణ, సైబర్ భద్రత, సున్నితమైన సమాచార డేటా తదితర అంశాలతోపాటు శాంతిబద్రతల పరిరక్షణ విధుల నిర్వహణకు నిధులతోపాటు ఎప్పటికప్పుడు సిబ్బంది నియామకం కీలకం అని హోంశాఖ చెబుతోంది. సమగ్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు సరిహద్దుల్లో వాణిజ్యం విస్తరణ, పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాల బలోపేతానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడానికి బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందునా సామాజిక పెట్టుబడులతోపాటు ఆర్థిక మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది.

What minister Kiren Rijiju wants from this Budget

2017 - 18లో 11 శాతం కేటాయింపుల పెరుగుదల

2016 - 17తో పోలిస్తే గతేడాది బడ్జెట్‌లో రూ.75,355 కోట్ల నుంచి రూ.83,823 కోట్ల నిదులు పెంచారు. ఇది 11శాతం పెరుగుదలే. అంతకుముందు 2014 - 15లో రూ.61,401.78 కోట్లు, 2015 - 16లో 65,651.10 కోట్లు పెంచారు. పెరిగిన ఈ నిధులతో అంతర్గత భద్రతా కవచం ఆధునీకరణకు హోంశాఖ దీర్ఘ కాలిక ప్రణాళిక అమలు చేస్తున్నది. ఇందుకు ఇంకొన్ని బడ్జెట్లలోనూ అధిక కేటాయింపులు అవసరం. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అధిక నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖకు హోంశాఖ విజ్నప్తి చేసింది. ఈశాన్య భారత రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో సీమాంతర తీవ్రవాదానికి తోడు దేశీయంగా పలు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉన్నాయి. ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఏ యేటికాయేడు మిలిటెంట్ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. జమ్ముకశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదానికి తోడు సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో పరిస్థితి విషమిస్తున్నది. సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిన బాధ్యత కేంద్రానిదే.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో మెరుగవుతున్న పరిస్థితి

ఇక వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఒకింత మెరుగవుతున్నది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు మారుమూల ప్రాంతాల్లో నక్సల్స్ గ్రూపులకు ఒకింత పట్టు ఉండేది. నిరుపేదలైన గిరిజనుల అభివ్రుద్దికి చర్యలు చేపడతూనే స్థానికులకు రక్షణ కల్పిస్తూ మరోవైపు భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో సీఏపీఎఫ్ బెటాలియన్లు, హెలికాప్టర్ల సాయం, మానవ రహిత విమానాలు, తదితర మార్గాల్లో వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కారానికి హోంశాఖ చర్యలు తీసుకుంటున్నది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిధిలో 35 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక కేంద్ర సాయం పథకం కింద ప్రజా మౌలిక వసతులు, సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నది. ఈ విధానంలో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. దీని ఫలితంగా 2010తో పోలిస్తే నక్సల్స్ దాడుల ఘటనలు తగ్గుముఖం పట్టాయని గణాంకాలు చెబుతున్నాయి. 2010లో నక్సల్స్ దాడుల్లో మరణించిన వారు 1005 మంది ఉంటే 2017లో అది 263 మందికి చేరుకున్నది. 2010లో 2213 దాడులు జరిగితే గతేడాది నాటికి 908 ఘటనలకు పడిపోయాయి.

What minister Kiren Rijiju wants from this Budget

మహిళలపై దాడుల నియంత్రణలో పోలీసుశాఖ విఫలం

ఇదిలా ఉంటే నిర్భయ వంటి ఘటనలు జరుగుతున్నా, వాటిని నియంత్రించడంలో పోలీసుశాఖ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి 'నిర్భయ' పథకం కింద కేటాయించిన నిధులేవీ ఖర్చు కాకపోవడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. బాధితులకు పరిహారం చెల్లింపునకు అనుసరిస్తున్న విధానాలు సరిగ్గా లేవని కూడా మండి పడింది. 2016లో నిర్భయ నిధి కింద చేపట్టిన పథకాలు నెమ్మదిగా సాగుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం విమర్శించింది. మానవ హక్కుల అభివ్రుద్ది కేంద్రం అంచనా ప్రకారం నిర్భయ పథకాల అమలులో ఎడతెగని వివిధ శాఖల మధ్య సమన్వయం సమస్యగా పరిణమించిందన్న విమర్శ ఉంది. 2015లో మహిళలపై 3,29,243 దాడులు జరిగితే, 2016లో 3,38,954 దాడులు జరిగాయి. బాలలపై 94,172 నుంచి 1,06, 958 దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14.5 శాతం కేసులు నమోదవుతుండగా తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ నిలిచాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Ministry of Home Affairs faces several challenges to provide safe and secure environment to the people of the country. Today, major challenges before us are cross-border terrorism, insurgency, left wing extremism (LWE), cyber and information security issues, radicalisation, and ever-increasing frequency of natural and manmade disasters. Keeping up the morale of our forces, which work under constant stress and extremely hostile conditions, requires continuous improvement in working conditions and welfare of personnel. Regular vulnerability analysis and upgradation in the border security apparatus, including technological interventions, wherever traditional methods are not yielding, is also a challenge as it is costlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more