ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో వచ్చేస్తుంది.. మస్క్ మాస్టర్ ప్లాన్!

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి దృష్టి ఇప్పుడు ఎలన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ 'స్పేస్ ఎక్స్'పై పడింది. చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా నిలిచేందుకు స్పేస్ ఎక్స్ సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2.25 లక్షల కోట్లకు పైగా(సుమారు 25 బిలియన్ డాలర్లు) నిధులు సమీకరించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నిజమైతే సౌదీ ఆరాంకో రికార్డును అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోలలో ఒకటిగా నిలుస్తుంది.

ఐపీవో అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?
ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) అంటే.. ఒక ప్రైవేట్ కంపెనీ తొలిసారిగా తమ షేర్లను సామాన్య ప్రజలకు విక్రయించడం ద్వారా పబ్లిక్ హోల్డింగ్ కంపెనీగా మారడం. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీలు భారీ మొత్తంలో నిధులను సేకరించి, తమ వ్యాపారాలను విస్తరించడానికి, అప్పులు తీర్చడానికి లేదా బ్రాండ్ విలువ, విశ్వసనీయతను పెంచుకోవడానికి ఉపయోగిస్తాయి. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక నిధులు సమీకరించిన ఐపీవోగా హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ.27 వేల కోట్లకుపైగా) అగ్రస్థానంలో ఉంది. గతంలో LIC కూడా అతిపెద్ద IPOగా నిలిచింది. మీషో, గ్రో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వచ్చే ఏడాది రిలయన్స్ జియో, జెప్టో, ఫోన్‌పే వంటి సంస్థలు కూడా ఐపీవోలకు సన్నాహాలు చేస్తున్నాయి.

World Biggest IPO Incoming Elon Musk SpaceX Master Plan Explained

సౌదీ ఆరాంకో రికార్డుకు సవాల్
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అతిపెద్ద ఐపీవోగా సౌదీ ఆరాంకో ఉంది. ఆరాంకో 25 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించింది. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ రాకెట్, శాటిలైట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ ఈ రికార్డును బద్ధలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ ఐపీవో ద్వారా 25 బిలియన్ డాలర్లకు పైగా అంటే భారత కరెన్సీలో రూ.2.25 లక్షల కోట్లకు పైగా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రస్తుతం ఇన్‌సైడర్ షేర్ సేల్ (అంతర్గత వాటా విక్రయం) ప్రక్రియను చేపడుతోంది. ఈ ప్రక్రియ ద్వారా SpaceX విలువను ఏకంగా 800 బిలియన్ డాలర్లు (సుమారు రూ.72 లక్షల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. దీంతో ఇది చాట్‌జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ రికార్డును దాటి, ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీగా నిలుస్తోంది.

ఐపీవో వివరాలు, నిధుల వినియోగం
స్పేస్ ఎక్స్ ఇప్పటికే అర్హులైన వాటాదారుల నుంచి మొత్తం 2.56 బిలియన్ డాలర్ల (రూ.23 వేల కోట్లకుపైగా) విలువైన షేర్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది.ఇక్కడ ఒక్కో షేరుకు 421 డాలర్లు (సుమారు రూ.38 వేలు) చెల్లించడానికి ఆఫర్ ఇచ్చింది.

స్పేస్ ఎక్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) బ్రెట్ జాన్సెన్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ IPO వివరాలు వెల్లడయ్యాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రధానంగా ఈ లక్ష్యాల కోసం వినియోగించనున్నారు. స్టార్‌షిప్ రాకెట్ అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వచ్చే ఏడాదిలోనే స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఐపీవో విజయవంతమైతే, అంతరిక్ష పరిశ్రమలో, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో స్పేస్ ఎక్స్ ఒక సరికొత్త చరిత్రకు తెర తీస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+