రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఈ స్కీమ్ లో లోన్ ఇస్తున్నారు
వ్యాపారం చేయడానికి బ్యాంకులు లోన్లు ఇవ్వలేదని నిరాశ చెందవద్దు. కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారితో పాటు మహిళలకు కూడా రుణాలు మంజూరు చేస్తోంది. ఆ పథకం పేరు స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్. ఏడు సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించారు. ఈ పథకంద్వారా రుణాలు పొందుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
స్టాండ్‌అప్ ఇండియా పథకం ద్వారా రుణం కావాలనుకునేవారు https://www.standupmitra.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,08,454 మంది అప్లై చేశారు. వీరిలో 1,87,699 మందికి రుణాలు మంజూరు చేశారు. 2016లో ప్రారంభించిన ఈ పథకం 2025 వరకు అందుబాటులో ఉంటుంది. మరో రెండు సంవత్సరాల సమయం ఉంది. ఈ పథకం మొత్తం టర్మ్ లో రూ.20వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. దరఖాస్తు చేసుకున్నవారు రుణం కింద రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు పొందొచ్చు.

స్టాండ్‌అప్ ఇండియా పథకం ద్వారా లోన్ తీసుకోవాలంటే 18 సంవత్సరాల వయసు నిండివుండాలి. భాగస్వాములతో వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీ, మహిళకు 51 శాతం వాటా ఉండాలి. బ్యాంకుల నుంచి గతంలో రుణాలు తీసుకొని డిఫాల్ట్ అయివుండకూడదు. ప్రతీ బ్యాంకులో కనీసం ఒక్కరికైనా ఈ స్కీమ్ కింద రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది.షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్‌లో లేదంటే స్టాండప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కు కూడా అప్లికేషన్ పంపొచ్చు.












Click it and Unblock the Notifications