Leaders: పళనిస్వామి దెబ్బకు రెండు వర్గాలు ఒక్కటి అవుతాయా ?, సీన్ లోకి శశికళ ఎంట్రీ ?, ఏం జరుగుతోంది!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మరోసారి రెచ్చకెక్కింది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో లొల్లి మొదలైయ్యింది. తరువాత అన్నాడీఎంకే పార్టీలో చక్రం తిప్పడానికి జయలలిత నెచ్చలి శశికళ ప్రయత్నించడం, ఓ పన్నీర్ సెల్వం వేరుకుంపటి పెట్టడం, తరువాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం కావడం జరిగిపోయింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన కొన్ని నెలల తరువాత ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటి కావడం, తరువాత శశికళను పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది.
ఇప్పుడు పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీరు సెల్వం గొడవలు పడుతున్న సమయంలో అన్నాడీఎంకే పార్టీలో పెత్తనం చెలాయించడానికి మరోసారి వీకే. శశికళ తెరమీదకు రావడానికి సిద్దం అయ్యారని తెలిసింది. పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామి మీద పగ తీర్చుకోవడానికి పన్నీర్ సెల్వం, శశికళ చేతులు కలుపుతారా, లేదా ? అని వేచి చూడాలని కొందరు అన్నాడీఎంకే పార్టీ నేతలు అంటున్నారు.

జయలలిత ఉంటే ఇలా జరిగేదా?
జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో లొల్లి మొదలైయ్యింది. తరువాత అన్నాడీఎంకే పార్టీలో చక్రం తిప్పడానికి జయలలిత నెచ్చలి శశికళ ప్రయత్నించడం, ఓ పన్నీర్ సెల్వం వేరుకుంపటి పెట్టడం, తరువాత ఎడప్పాడి పళనిస్వామి సీఎం కావడం జరిగిపోయింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన తరువాత సీన్ మారిపోయింది.

ఢిల్లీ పెద్దలతో రాజీ
శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహారకు చేరుకున్న కొన్ని నెలల తరువాత అప్పటి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను ఢిల్లీలోని కొందరు పెద్దలు ఒక్కటి చెయ్యడం, తరువాత పన్నీర్ సెల్వం డిప్యూటీ సీఎం కావడం, శశికళ, ఆమె కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి.

అధికారంలో ఉన్నంత వరకు ఓకే
ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అన్నాడీఎంకే పార్టీకి మెజారీ ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని సాఫీగా ముందుకుసాగించారు. తమిళనాడులో అధికారంలో ఉన్నంత వరకు బాగానే ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం తరువాత డీఎంకే దెబ్బకు అధికారానికి దూరం అయ్యారు.

జయలలిత పదవి అని ఆరోజు చెప్పి?
శశికళను అప్పట్లో అన్నాడీఎంకే ప్రాధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అయితే శశికళను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత జయలలిత అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని అప్పట్లో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రకటించారు. తరువాత సమన్వయకర్త, ఉప సమనయ్వకర్త అని పదవులు తెరమీదకు తెచ్చి అన్నాడీఎంకే పార్టీ శాస్వత ప్రధాన కార్యదర్శిగా జయలలిత పేరు ఖరారు చేశారు.

శశికళ ఎంట్రీ?
ఎడప్పాడి పళనిస్వామి, పన్నీరు సెల్వం గొడవలు పడుతున్న సమయంలో అన్నాడీఎంకే పార్టీలో పెత్తనం సాగించడానికి మరోసారి వీకే. శశికళ తెరమీదకు రావడానికి సిద్దం అయ్యారని తెలిసింది. పార్టీ నుంచి బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామి మీద పగ తీర్చుకోవడానికి పన్నీర్ సెల్వం, శశికళ చేతులు కలుపుతారా ?, లేక వేరే మార్గంలో ఎడప్పాడి పళనిస్వామి మీద పగ తీర్చుకుంటారా ? అనే విసయం వేచి చూడాలని అన్నాడీఎంకే పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications