ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చంద్రగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పుత్తూరు నియోజకవర్గం నుండి రామచంద్రాపురం మండలం, పీలేరు నియోజకవర్గంలో ఉన్న ఎర్రావారి పాళ్యం, చిననగట్టిగల్లు, తిరుపతి రూరల్ మండలాలు చంద్రగిరి నియోజకవర్గంలో చేరాయి. చంద్రగిరి నియోజకవర్గం నుండి ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభించా రు. చంద్రబాబు 1989 నుండి వరుసగా ఆరు సార్లు గెలిచారు. 1978 లో ఇక్కడ తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు 1983 లో టిడిపి అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. 1994 లో ఇదే నియోకవర్గం నుండి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయు డు టిడిపి అభ్యర్ధి గా గెలుపొందారు. ఇద్దరు మహిళా నేతలు గల్లా అరుణ..సినీ నటి రోజా సైతం ఈ నియోజకవర్గం నుండే ఎన్నికల బరిలోకి దిగారు.
1952 నుండి ఇప్పటి దాకా..
1952 లో ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గం 1955 లో తవనంపల్లె గా మారింది. ఆ తరువాత 1967 లో బంగారుపాళ్యంగా మార్చారు. తిరిగి 1978 లో చంద్రగిరి నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. మాజీ మంత్రి గల్లా అరుణ ఇక్కడి నుం డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ హయాంలో మంత్రిగా పని చేసారు. అరుణ తండ్రి రాజగోపాల నాయు డు రెండు సార్లు తవనంపల్లె నుండి ఎమ్మెల్యేగా.. రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 2009 వరకు అరుణ కుమారి కాంగ్రెస్ లో..రోజా టిడిపిలో ఉండేవారు. 2014 ఎన్నికల నాటికి పరిణామాలు మారిపోయాయి. గల్లా అరుణ టిడిపిలో చేరగా..రోజా వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో..
2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తంగా 253686 ఓట్లు ఉంటే, అందులో 205724 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి 100924 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన గల్లా అరుణ కుమారికి 96406 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర రెడ్డి 4518 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, ఇక్కడ అరుణ కుమా రి ఎమ్మెల్యేగా ఓడిపోగా..గుంటూరు నుండి టిడిపి ఎంపీగా పోటీ చేసిన అరుణ కుమారి తనయుడు జయదేవ్ విజయం సాధించారు. ఇక, నియోకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్న అరుణ కుమారి ప్రస్తుతం టిడిపి పాలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో..
ఇక, చంద్రగిరి నుండి వచ్చే ఎన్నికల్లో వైసిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరిగి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన జగన్ కు విధేయుడిగా ఉండటంతో పాటుగా టిడిపి శ్రేణులతో పోరాటం చేస్తున్న నేతగా గుర్తింపు పొందారు. ఇక, టిడిపి నుండి ఇప్పటికే అక్కడ ఇన్‌ఛార్జ్ గా నియమించిన వ్యక్తితో పాటుగా మరో ముఖ్య నేత టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక, 2009 లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన సాయి రమణి రెడ్డి కి 29833 ఓట్లు వచ్చాయి. దీంతో..ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇక్కడి నుండి ఎవరిని బరిలోకి దింపుతారో ఇంకా స్పష్టత లేదు. ఇక్కడ ప్రధానంగా టిడిపి- వైసిపి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications