రోడ్ టెర్రర్ : లారీ-కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

రేణిగుంట : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదం నింపింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రేణిగుంట - కడప రహదారి లోని మామండూరు దగ్గర లారీ - కారు ఢీకొన్న ఘటనలో నలుగురు పెద్దలు, ఒక చిన్నారి ప్రాణాలు విడిచారు.

కడప జిల్లా సీకే దిన్నెకు చెందిన గంగాధర్ విదేశాల నుంచి స్వగ్రామానికి వచ్చేందుకు చెన్నై చేరుకున్నారు. గంగాధర్ ను తమ గ్రామానికి తీసుకొచ్చే క్రమంలో కుటుంబ సభ్యులు కారు తీసుకుని చెన్నైకి బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణంలో కడప నుంచి రేణిగుంట వైపు వస్తున్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో గంగాధర్ తో పాటు ఆయన భార్య, తమ్ముడు, మరదలు, రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

five members of the same family died in road accident
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+