చావు తప్పి కన్నులొట్టబోయింది.. టిక్‌టాక్ మోజులో పడి అటవీలోకి... ఏం జరిగిందో తెలుసా..?
చిత్తూరు : ఔను చావు తప్పి కన్నులొట్టబోయింది. టిక్ టాక్ మాయలో పడి ఓ యువకుడు ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. వీడియో కోసం వినూత్నంగా ఆలోచించడమే ఆయన చేసిన తప్పిదమైంది. అదీ అడవీలో వీడియో తీద్దామని వెళ్లి .. దారి తప్పిపోయాడు. దీంతో అతను అడవీలో అరణ్యవేదన. స్నేహితులకు లోకేషన్ షేర్ చేసిన ఆచూకీ కనుక్కొవడం చాలా ఆలస్యమైంది.

టిక్‌టాక్ ...
చిన్న, పెద్ద అనే తేడా లేనేలేదు. టిక్ టాక్ యాప్‌లో మునిగితేలుతున్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగుల టిక్ టాక్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత గాంధీలో ఫిజియో థెరపీ వైద్యులు కూడా అలానే చేశారు. అయితే ఏపీలోని చిత్తూరుకు చెందిన ఓ యువకుడు కూడా టిక్ టాక్ కోసం అటవీలోకి వెళ్లి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. అయితే అతని ఆచూకీ కనుక్కొవడం ఆలస్యమైంది. దీంతో తెల్లవార్లు అటవీలో గజ గజ వణికిపోయాడు.

అటవీలో వీడియో ..
చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన మురళి తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇటీవల అతని ఫ్రెండ్స్ టిక్ టిక్ తెగ చేసేస్తున్నారు. దీంతో అతను కూడా చేయాలనుకున్నాడు. అయితే అందుకోసం అరణ్యానికి ఎంచుకున్నాడు మురళి. చంద్రగిరి మండలంలోని శేషాచలంలో అటవీలోకి వెళ్లాడు. వీడియో కోసం లోకేషన్ చూస్తూ వెళ్లిపోయాడు. ఎలాగోలా వీడియో అయితే తీశాడు. కానీ వచ్చినదారి మరచిపోయాడు. ఇంకేముంది ఎలా వెళ్లాలో తెలియదు. తిరిగి తిరిగి అలసిపోయాడు.

తప్పిపోయిన మురళి
తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేశాడు. వాట్సాప్ ద్వారా లోకేషన్ షేర్ చేశాడు. లోకేషన్ వచ్చింది .. కానీ మురళి ఉన్న ప్రాంతాన్ని అతని ఫ్రెండ్స్ తెలుసుకోలేకపోయారు. దీంతో అడవీలోనే ఒకరోజు రాత్రి ఉండిపోయాడు మురళి. దెబ్బకు అతనికి ఫిట్స్ వచ్చాయి. అస్వస్థతకు గురయ్యాడు. అతని ఫ్రెండ్స్ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు అడవీలో ఆ రాత్రే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ రాత్రి మాత్రం మురళి ఆచూకీ తెలియలేదు. తెల్లవారిన తర్వాత మురళి ఎలాగోలా కనుగొన్నారు. కానీ అతను సృహలో లేకపోవడంతో వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యం అందిస్తున్నామని .. ప్రస్తుతం స్థిమితంగా ఆరోగ్యం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications