నారా లోకేష్ పాదయాత్ర చేస్తోంటే..ఆయన భార్య రేసులకు పోయిందంట..!!
మంత్రి రోజాపై నారా లోకేష్ చేసిన విమర్శలకు నిరసనగా చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ మహిళా నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
చిత్తూరు: పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల దుమారం తగ్గట్లేదు. రోజాను జబర్దస్త్ ఆంటీ అంటూ నారా లోకేష్ సంబోధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, రోజా అనుచరులు, ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నారా లోకేష్, నగరి టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫ్లెక్సీలను చీపుర్లతో కొట్టారు.

రోజా కౌంటర్ అటాక్..
తనపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను రోజా ఇదివరకే తిప్పి కొట్టారు. ఆయనను అంకుల్‌గా సంబోధించారు. లోకేష్ది ఐరెన్ లెగ్ అని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ చేపట్టింది పాదయాత్ర కాదని జోకేశ్ యాత్రగా చురకలు అంటించారు. లోకేష్ రాజకీయ అరంగేట్రంతో చంద్రబాబు పతనం మొదలైందని రోజా విమర్శించారు. నారా లోకేష్ తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడాన్ని రోజా తప్పుపట్టారు. లోకేష్ ఏక్ నిరంజన్ లాంటోడని, ఆయనకు తోబుట్టువులెవరూ లేరని, అందుకే వారి విలువ తెలియట్లేదని అన్నారు.

రోడ్డెక్కిన వైసీపీ మహిళ నేతలు..
ఇవ్వాళ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు రోడ్డెక్కారు. నగరిలో ఆందోళనకు దిగారు. నారా లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాష్ పైనా ఘాటు విమర్శలు చేశారు. నగరి సెంటర్ లో వారిద్దరి ఫ్లెక్సీల, బ్యానర్లను చీపుర్లతో కొట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినదించారు.

ఎక్కడో ఉంటూ..
నియోజకవర్గంలో నివాసం ఉండకుండా ఎక్కడో ఉంటూ రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. అర్ధరాత్రి వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేయిస్తోన్నారని ఆరోపించారు. వైసీపీ మహిళా నాయకుల పసుపుకుంకుమ తుడిచేస్తానంటూ స్థానిక టీడీపీ నాయకులు హెచ్చరించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

లోకేష్ పాదయాత్ర చేస్తోంటే..
లోకేష్ పాదయాత్ర చేస్తోంటే ఆయన భార్య హైదరాబాద్ లో రేసులు చూడ్డానికి పోయిందంటూ వైసీపీ మహిళా నేతలు ఎద్దేవా చేశారు. నారా కుటుంబం ప్రజల పక్షం కాదనేది అక్కడే తేలిపోయిందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారని, నగరి నుంచి 30 ఏళ్లు రోజా గెలుస్తారని తేల్చి చెప్పారు. ప్రజలు ఇచ్చే భవిష్యత్ తీర్పు ఇదేనని అన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications