వాస్తు ప్రకారం తోరణాలను ఎప్పుడు మార్చాలి, అలా చేయకపోతే జరిగే అశుభాలు
వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి అగ్రస్థానం ఉంటుంది. ఇంటికి సానుకూల లేదా ప్రతికూలత ప్రవేశించే మార్గం ఇదే కావడం వల్ల వాస్తు ప్రకారం గుమ్మాన్ని అలంకరించడం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారానికి సంబంధించిన అనేక నియమాలు, పరిష్కారాలను వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది. వాటిలో తోరణాలు కట్టడం అనేది అత్యంత ముఖ్యమైనది. గుమ్మానికి మావితోరణాలను కట్టడం సర్వసాధారణం. కొన్నిచోట్ల అశోక వృక్షాల ఆకులతో కూడా తోరణాలు కట్టే సంప్రదాయం ఉంది.
వాటిని ఎలా కట్టాలి, ఎప్పుడు తొలగించాలి అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. తోరణానికి సంబంధించిన వాస్తు నియమాలు, ముఖ్యంగా వాటిని మెయిన్‌డోర్ నుండి ఎంతకాలానికి తీసివేయాలి లేదా మార్చాలి అనే అంశాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

సహజ తోరణాలు ఎంతకాలం ఉంచాలి?
చాలా మంది కృత్రిమ తోరణాలను ప్రధాన ద్వారం వద్ద కట్టినా, వాస్తు శాస్త్రం మాత్రం అసలు ఆకులు, పూలతో చేసిన తోరణాలకే అధిక ప్రాధాన్యతనిస్తుంది. నియమం ప్రకారం ఈ తోరణాలను ఏడు నుండి 10 రోజులలోపు మార్చాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో 12-15 రోజుల వరకు కూడా ఉంచవచ్చు. ఇలాంటప్పుడు తోరణంలోని పువ్వులు, ఆకులు ఎండిపోకుండా తాజాగా ఉండాలి. పండుగలప్పుడు కట్టే తోరణాలను ఎక్కువ రోజులు ఉంచరాదు. అవి ఎప్పుడూ తాజాగా కనిపించడమే ముఖ్యం.
కృత్రిమ తోరణాల నియమాలు
వస్త్రాలు, పూసలు లేదా ప్లాస్టిక్‌తో తయారు చేసిన కృత్రిమ తోరణాలను ఉపయోగించే వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. మురికిగా లేదా దుమ్ముతో నిండిన తోరణాలు ఇంటి వాస్తును ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి నెలలో కనీసం 4-5 సార్లు వాటిని శుభ్రం చేయాలి. ప్రధాన ద్వారం చుట్టూ పరిశుభ్రత మంచి వాస్తుకు సూచిక. తోరణానికి సంబంధించిన కీలకమైన మూడు వాస్తు నియమాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
తోరణం విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మూడు అంశాలు
1. పాడైన తోరణాలను వాడకూడదు
మీ ప్రధాన ద్వారం వద్ద కట్టే తోరణం ఎక్కడి నుంచైనా విరిగిపోయినా, లేదా దాని దారాలు ఊడిపోతున్నా, వెంటనే దానిని మార్చేయాలి. వాస్తు ప్రకారం, విరిగిన వస్తువులు ఇంట్లో అవాంతరాలను, అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అందువల్ల, ఎల్లప్పుడూ అందమైన, చెక్కుచెదరని తోరణంనే వాడాలి.
2. ఆకుల సంఖ్య ఎలా ఉండాలి?
వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, తోరణంలో ఆకుల సంఖ్య సరైన విధంగా ఉండాలి. నియమం ప్రకారం, ఆకులు ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో, అంటే విషమ సంఖ్యలో మాత్రమే ఉండాలి. 5, 7, 11 లేదా 21 ఆకులతో కూడిన తోరణం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు కలగకుండా కాపాడుతుంది.
3. తోరణం అమర్చడానికి సరైన దిశ
వాస్తు శాస్త్రం ప్రకారం, తోరణాన్ని ఎల్లప్పుడూ ప్రధాన ద్వారానికి సరిగ్గా పైన, నేరుగా కట్టాలి. వంకరగా వేలాడే తోరణాలు మంచిది కాదని భావిస్తారు. అది క్రిందికి వేలాడుతున్నట్లు కాకుండా, గట్టిగా కట్టి ఉండాలి. ఈ నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, శుభం కలుగుతుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మరింత విస్తృతమైన సమాచారం, సలహాల కోసం వాస్తు నిపుణులను సంప్రదించాలి.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications