ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి ఫొటోలను పూజించాలో తెలుసా- ఈ తప్పులు చేస్తే సంపద ఆవిరి..
శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా కొన్ని రకాల చిత్రపటాలను పూజించకూడదని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. ఏ లక్ష్మీ చిత్రపటాన్ని పూజించాలి, ఏది పూజించకూడదు అనేది తెలుసుకుందాం.

శుభ ఫలితాలు, లక్ష్మీదేవి కృప కోసం శుక్రవారం పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజించాలి. ఈ చిత్రపటంలో లక్ష్మీదేవి కమలంపై కూర్చుని ఒక చేతిలో నాణేలు నిండిన కలశాన్ని పట్టుకుని, దాని నుండి బంగారు నాణేలు కురుస్తున్నట్లు ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజిస్తే సంపద, శ్రేయస్సు లభిస్తాయి. ఇంట్లో ఈ చిత్రపటాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి కుటుంబ సభ్యులందరిపై తన ఆశీర్వాదాలను కురిపిస్తుంది.
శుక్రవారమే కాకుండా ఇతర రోజుల్లో కూడా గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజించకూడదు. ఈ చిత్రపటం లక్ష్మీదేవి ప్రయాణాన్ని సూచిస్తుంది. గుడ్లగూబపై ఆమె సంచరిస్తుంది కాబట్టి, ఆ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించడం సరికాదని పండితులు అంటున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచేటప్పుడు కొన్ని దిశలను గమనించాలి. శాస్త్రాల ప్రకారం, లక్ష్మీదేవి విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచకూడదు.
పగిలిన లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. అలాంటి విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేయాలి. కొత్త విగ్రహాలను ప్రతిష్టించాలి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉత్తరం వైపు ఉంచడం శ్రేయస్కరం. పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజించడం మంచిది. గుడ్లగూబపై ఉన్న విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజించకూడదు, ఇది ఆర్థిక సమస్యలకు దారి తీయవచ్చు.












Click it and Unblock the Notifications