గ్రహణ కాలంలో ఆ స్వామివారికి విపరీతంగా ఆకలి- అందుకే పూజలు ఆపరు..
Lunar eclipse 2025: ఈ నెల 7- 8 తేదీల్లో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది- పౌర్ణమి రోజున రాహుగ్రస్త కాలంలో శతభిష నక్షత్రంలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఆ రోజు నుంచే పితృపక్షం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.
సాధారణంగా, చంద్రగ్రహణం రోజున ఆలయాలన్నీ మూసివేస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి సహా కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వంటి దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు మూత పడనున్నాయి. 7న మధ్యాహ్నం 3 గంటల తర్వాత మూసివేస్తారు. మళ్లీ గ్రహణ కాలం పూర్తయిన తర్వాత మహాసంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు.కొన్ని ప్రసిద్ధ ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ యాధాతథంగా తెరిచే ఉంటాయి. ఇలాంటివి అయిదు ఆలయాలు మాత్రమే ఉన్నాయి.

శ్రీకాళహస్తి..
శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఎటువంటి గ్రహణదోషాలు పట్టవు. పరమశివుడు వాయులింగంలో వెలిశాడిక్కడ. ఇక్కడ రాహు కేతువుల పూజలు నిత్యం నిర్వహిస్తుంటారు. గ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా వ్రతాలనూ ఆచరిస్తారు. సూర్యగ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. ఇక్కడ యధాతథంగా నిత్య పూజలు కొనసాగుతాయి.
విష్ణుపాద దేవాలయం- గయ
బీహార్‌లోని గయలో ఉన్న విష్ణుపాద దేవాలయం పిండ ప్రదానానికి అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో కూడా తెరిచి ఉంటుంది. గ్రహణ కాలంలో ఇక్కడ పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూర్వీకులకు పిండ ప్రదానం చేసి, విష్ణువు పాదాలకు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత.
మహాకాళ దేవాలయం- ఉజ్జయిని
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడి దేవాలయం శైవ భక్తులకు పవిత్ర స్థలం. ఈ ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. భక్తులు ఎటువంటి ఆంక్షలు లేకుండా దర్శనం చేసుకోవచ్చు. పూజ, హారతి సమయాల్లో మాత్రం చిన్నపాటి మార్పులు ఉంటాయి.
లక్ష్మీనాథ్ దేవాలయం- బికనీర్
రాజస్థాన్ బికనీర్‌లోని లక్ష్మీనాథ్ దేవాలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. ఒకసారి గ్రహణం సమయంలో పూజారులు ఆలయం తలుపులు మూసి, నైవేద్యం సమర్పించలేదు. లక్ష్మీనాథుడు ఒక పిల్లవాడి రూపంలో బయటికి వచ్చాడట. ఆలయం ఎదుట ఉన్న ఓ దుకాణదారుడికి తన ఆకలి గురించి చెప్పాడు. కాలి కడియాన్ని దుకాణదారుడికి ఇచ్చి పదార్థలు తిని ఆకలి తీర్చుకున్నాడు. మరుసటి రోజు ఆలయంలో విగ్రహం కాలికి ఉన్న కడియం కనిపించకపోవడంతో దుకాణదారుడు పూజారులకు విషయాన్ని తెలియజేశాడు. అప్పటి నుండి, ఈ ఆలయం గ్రహణం సమయంలో కూడా మూసివేయరు. నైవేద్యం సమర్పించడం ఆపరు.
తిరువార్పు కృష్ణ దేవాలయం- కేరళ
కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న తిరువార్పు కృష్ణ దేవాలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. గ్రహణం సమయంలో ఆలయాన్ని మూసివేసి, నైవేద్యం ఇవ్వకపోతే శ్రీకృష్ణుడి విగ్రహం బలహీనపడుతుందని ఇక్కడ ఒక నమ్మకం ఉంది. ఒకసారి ఆలయం మూసినప్పుడు, మరుసటి రోజు విగ్రహం బలహీనపడటంతో, అప్పటి నుండి ఈ ఆలయాన్ని గ్రహణ సమయంలో మూసివేయడం ఆపేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications