భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక దేశాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా..?
మీరు భారతదేశం మ్యాప్‌ను ఎప్పుడైనా నిశితంగా గమనించారా..? ప్రతి భారతదేశం మ్యాప్‌లో శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది.సాధారణంగా ప్రతి దేశానికి సరిహద్దులుంటాయి. వాటికి అనుగుణంగానే ఆయా దేశాల మ్యాప్‌లను రూపొందిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇలాగే తమ దేశపు భూగోళాన్ని మ్యాప్‌లో పొందుపరుస్తున్నారు. కాని ఒక్క భారతదేశం మాత్రమే తమ భూగోళంలో పక్కనే ఉన్న శ్రీలంక దేశాన్ని కూడా చూపిస్తుంది.
ఇలా ఒక దేశాన్ని మరో దేశంలో మ్యాప్‌లో మనం ఎప్పుడు చూసింది లేదు. మన సరిహద్దు దేశాలైనా పాకిస్థాన్, చైనా , బంగ్లాదేశ్ ఏ దేశాలు కూడా భారతదేశం మ్యాప్‌లో కనిపించవు. కాని ఒక్క భారతదేశం మాత్రమే శ్రీలంక దేశాన్ని తమ మ్యాప్‌లో చూపిస్తుంది. భారతదేశపు ప్రతి మ్యాప్‌లో శ్రీలంక దేశాన్ని చూపించడానికి ఓ కారణం ఉంది. శ్రీలంక దేశాన్ని భారతదేశపు మ్యాప్ ఎందుకు చూపిస్తారో అనేది మనలో చాలామందికి తెలియదు.

యునైటెడ్ నేషన్స్ 1958లో ఓ చట్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో 'లా ఆఫ్ ది సీ' పేరుతో ఒక అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించారు. సముద్రానికి సంబంధించిన సరిహద్దులు మరియు ఒప్పందాలను తప్పనసరిగా చేసింది. ఏదైనా ఒక దేశం సముద్ర తీరంలో లేదా ఆ దేశం యొక్క సరిహద్దు ప్రాంతం సముద్రంతో సంబంధం కలిగి ఉంటే.. ఆ దేశం యొక్క బోర్డర్ అనేది మరొక దేశం యొక్క మ్యాప్‌లో చూపించాలి.

రెండు దేశాల మధ్య 200 నాటికల్ మైల్స్ అంటే 370 కిలోమీటర్లు లోపు ఉన్న దేశాన్ని కచ్చింతంగా తమ మ్యాప్‌లో కూడా చూపించాలి. అలా చూసుకుంటే భారతదేశం నుంచి శ్రీలంక 18 నాటికల్ మైల్స్ అంటే కేవలం 54.8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అందుకే మనం చూసే ప్రతి ఇండియా మ్యాప్‌లో శ్రీలంక కచ్చింతంగా దర్శనం ఇస్తుంది.












Click it and Unblock the Notifications