హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు?

Posted By:
Subscribe to Oneindia Telugu

మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవకంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు.

హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరున్నూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని అంటారు.

Why we celebrate Holi?

ఈనాడు లక్ష్మీనారాయణవ్రతం, అశోk పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి శయనదాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి. శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం. చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింపతగింది.

కొన్ని గ్రంథాలు దీనిని డోలాపూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగపురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని
ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.
ఫాల్గుణశుద్ధ పూర్ణిమనాడు చంద్రుడు ఉత్తరఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఫల్లని పంగుని అనీ, ఉత్తర ఉత్తిరమ్ అనీ అరవంలో మార్పు పొందాయి.

వంగుని ఉత్తిరమ్ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంతఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందంగోవిందంగా ఉంటుంది. వస్తూవున్న వసంతఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We will clebrate the Holi with colors. There is a convention to celebrate it in India.
Please Wait while comments are loading...