ఇప్పటంలో లోకేష్- ఇళ్లు కూలిన బాధితుల పరామర్శ-బాదుడే బాదుడు కార్యక్రమం
ఏపీలో ఇప్పటం గ్రామంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జనసేన ఆవిర్భావసభకు స్ధలం ఇచ్చిన దగ్గర మొదలైన ఈ చర్చ అనంతరం పవన్ కళ్యాణ్ రూ.50లక్షల సాయం ప్రకటించడం, అనంతరం ఆ డబ్బు సీఆర్డీయేకు జమ చేయమని అధికారులు కోరడం, నిరాకరించిన గ్రామస్తుల ఇళ్లను జేసీబీలతో కూల్చేయడం చకా చకా జరిగిపోయాయి. అనంతరం అక్కడికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ను సైతం అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు..చివరికి అనుమతించారు. దీంతో పవన్ ఇప్పటం వెళ్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇవాళ అదే గ్రామానికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వెళ్లారు.
ఇప్పటం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్సీ నారా లోకేష్ అక్కడికి వెళ్లారు. స్ధానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ప్రభుత్వం కూల్చేసిన ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల యజమానులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇళ్లను తిరిగి కట్టించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇళ్ల కూల్చివేత సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల్ని లోకేష్ కు స్దానికులు వివరించారు. అనంతరం లోకేష్ ఇప్పటం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత తర్వాత అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్లి వైఎస్సార్ విగ్రహం వదిలేసి మిగతా విగ్రహాలు కూల్చేయడాన్ని ప్రశ్నించారు. దీంతో పవన్ వెళ్లిపోయాక అక్కడ వైఎస్సార్ విగ్రహం కూడా తొలగించారు. ఇవాళ లోకేష్ పర్యటన సందర్భంగా గ్రామంలోనే ఉన్న మరో వైఎస్సార్ విగ్రహాన్ని సైతం అధికారులు తొలగించారు. లోకేష్ పర్యటన సందర్భంగా ఆ విగ్రహం అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటంలో లోకేష్- ఇళ్లు కూలిన బాధితుల పరామర్శ-బాదుడే బాదుడు కార్యక్రమం#andhrapradesh, #guntur, #ippatam, #naralokesh pic.twitter.com/RiEBzCQSOf
— oneindiatelugu (@oneindiatelugu) November 9, 2022












Click it and Unblock the Notifications