మాటేసి కాటేశాడు .. గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం
గుంటూరు : ఆ యువతి స్నేహితుడి కూతురు. అంటే తన కూతురు లాంటిది. కానీ అతడి వక్రబుద్ధి వావి వరస మరిచేట్టు చేసింది. ఆ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంతలో ఆమె మరోకరితో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. ఆమె తన సొంతమని భావించాడో ఏమో తెలియదు కానీ గొంతు కోసి చంపి తన ఉన్మాదాన్ని బయటపెట్టుకున్నాడు.
మాటేసి దాడి చేశాడు
గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో ఈ దాడి జరిగింది. సత్యనారాయణ (40) అనే వ్యక్తి తన స్నేహితుడి కూతురు జ్యోతి (20)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య అమ్మాయి వేరే అబ్బాయితో చనువుగా ఉంటోంది. తనతో ఉంటూ కూడా మరోకరితో క్లోజ్ గా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయిన సత్యనారాయణ .. చంపేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రవేశించాడు.0 జ్యోతి తల్లిదండ్రులు బయటకి వెళ్లారని నిర్ధారించుకున్నాకే .. జ్యోతి వద్దకెళ్లాడు. తనతోపాటు తీసుకొచ్చిన కత్తితో గొంతు కోసి తన ఉన్మాదాన్ని బయటపెట్టాడు. ఊహించని ఈ ఘటనతో బిత్తరపోయిన జ్యోతి .. నిమిషాల్లోనే విగతజీవితా మారింది. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ తుదిశ్వాస విడిచింది.

ఇదివరకే పెళ్లి .. విడిచి వెళ్లిపోయిన భార్య
సత్యనారాయణకు ఇదివరకే పెళ్లయింది. అయితే అతని అలవాట్లు, ప్రవర్తనను చూసి తీరు మార్చుకోవాలని ఆమె సూచించింది. అతగాడు వినలేదు .. ఇక ఆయనలో మార్పురాదని భావించిన ఆ ఇల్లాలు భర్తను వదిలేసి వెళ్లిపోయింది. భార్య ఉంటేనే బాలాదూర్ తిరిగిన సత్యనారాయణ .. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో ఇక ఆగడాలకు అంతేలేకుండా పోయింది. భార్య లేకపోవడంతో తనను అడిగేవారు లేకపోవడంతో ఊరి మీద పడి విచ్చలవిడిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే జ్యోతితో పరిచయం .. వివాహేతర సంబంధం ఏర్పడడానికి దారితీసింది. ఇతగాడి బుద్ధిని గమనించని ఆమె చనువుగా ఉండటమే పాపమైంది. చివరికి తన ప్రాణాన్ని తీస్తోందని ఊహించకపోవడమే ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.












Click it and Unblock the Notifications