ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రముఖ వ్యూహకర్త: ఈ రెండు స్థానాలపై గురి

Aara Mastan: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలను ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం- జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశాలు లేకపోలేదు.

ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారు. పోల్ స్ట్రాటజిస్ట్‌గా 16 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఆరితేరారనే గుర్తింపు ఆయనకు ఉంది. సర్వేలు, పోల్ మేనేజ్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Political strategist Aara Mastan to give a political entry,Here is the seat he is pitching to

ఏపీ, తెలంగాణల్లో ఆయన వేసిన అంచనాలు వంద శాతం నిజం అయ్యాయి. ఫలితాలపై వేసిన అంచనాలు వాస్తవ ఫలితాలకు అతి దగ్గరగా ఉండటం వల్ల ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. గత ఏడాది ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోతారనీ ఆరా మస్తాన్ ముందే అంచనా వేసిన విషయం తెలిసిందే.

రాజకీయాలతో పాటు ఆరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోన్నారు. చిలకలూరిపేట, గుంటూరు కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆరా ఫౌండేషన్ ద్వారా ఎంతోమందిని ఉన్నత చదువులు చదివించారు. వందలాదిమందికి ఉద్యోగాలు కల్పించగలిగారు.

ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేట నుంచి లేదా గుంటూరు ఈస్ట్ నుంచి గానీ పోటీ చేయాలనీ ఆయా పార్టీలు కోరినట్లు తెలుస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. టీడీపీ లేదా జనసేన నుండి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీచేయాలని అనుచరులు కోరుతున్నారు.

అక్కడ పోటీ చేయడం సాధ్యం కాకపోతే గుంటూరు ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ టికెట్‌తో ఎన్నికల బరిలో దిగితే గెలుపు నల్లేరుపై నడేకనని అనుచరులు భావిస్తున్నారు. మైనారిటీల ఓటుబ్యాంకు వైసీపీకి మద్దతుగా ఉందనే ప్రచారం నేపథ్యంలో, ఆ వర్గంలో మంచి గుర్తింపు ఉన్న ఆరా మస్తాన్‌.. టీడీపీ టికెట్‌తో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+