Hyderabad: పెట్రోల్ బంక్ లో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..
హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ పంపు వద్ద భారీ ప్రమాదం తప్పింది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంక్ లో బాటిళ్లో పెట్రోలు పోస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా లైటర్‌ను వెలిగించాడు. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అర్పారు. దీంతో పెను ప్రమాధం తప్పింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఒక మహిళ , ఆమె బిడ్డతో పాటు పలువురు ఉన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమదానికి కారుకులైన చిరన్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.మద్యం మత్తులో కనిపించిన చిరన్ చేతిలో లైటర్‌తో పెట్రోల్ పంపు వద్ద వెలిగించాడని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులో చిరన్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడని విరించారు. ఈ క్రమలంలో లైటర్ ను చూసిన పెట్రోల్ బంక్ ఉద్యోగి వెలిగిస్తావా అని అడిగాడు. ఎందుకు తీసుకొచ్చావని నిలదీశాడు. దీంతో మాటా మాట పెరిగింది. ఈ క్రమంలోనే "నీకు దమ్ముంటే వెలుగించు" అంటూ అతన్ని ఉద్యోగి మరింత రెచ్చగొట్టాడు.

చిరాన్ లైటర్‌ను వెలిగించాడు. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరన్, అరుణ్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. వీరిని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే మంటలు పెట్రోల్ బంక్ అంటుకుంటే తీవ్ర నష్టం వాటిల్లేదని చెబుతున్నారు. సిబ్బంది త్వరగ స్పందించి మంటలు అర్పడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
ఆ యుకుడు మద్యం తాగలేదని.. గంజాయి సేవించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసుల స్పందించలేదు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సేఫ్టీ అధికారులు సూచించారు. పెట్రోల్ బంక్ లో ఫోన్ కూడా ఎక్కువగా వినియోగించవద్దని చెబుతున్నారు.
నాచారం పీఎస్ పరిధిలో పెట్రోల్ బంక్‌లో తప్పిన పెను ప్రమాదం
— Aadhan Telugu (@AadhanTelugu) October 27, 2024
మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు
వెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్ సిబ్బంది
గంజాయి మత్తులో ఉన్న యువకులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది… pic.twitter.com/zu3tbMrJEZ












Click it and Unblock the Notifications