Hyderabad: హైదరాబాద్‍లో పాకిస్తానీ వ్యక్తి.. ఏడాది కాలంగా నివాసం.. చివరికి ఇలా దొరికాడు..
ఓ పాకిస్థానీ వ్యక్తి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించాడు. ఒకటి కాదు రెండు ఏకంగా ఏడాది కాలంగా ఇండియాలో నివాసిస్తున్నాడు. అదీ ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే. అతను భార్య కోసం భారత్ కు వచ్చినట్లు తెలిసింది. భార్య కోసం వచ్చిన అతను ఇక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇతర వ్యక్తి పేరుపై ఆధార్ కార్డు పొందే క్రమంలో అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తూంఖ్వా కు చెందిన ఫయాజ్అహ్మద్ ఉపాధి కోసం 2018 దుబాయ్ కి వెళ్లాడు.
అక్కడ ఓ కంపెనీలో అతను పనికి కుదిరాడు. అయితే హైదరాబాద్ బహదూర్ పుర ఠాణ్ పరిధిలోని కిషన్ బాగ్ చెందిన నేహా ఫాతిమా కూడా ఉపాధి కోసం దుబాయి వెళ్లింది. ఆమె అక్కడ ఉద్యోగం వెతుక్కోవడంలో ఫయాజ్ అహ్మద్ సాయం చేశాడు. తను పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2019లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత ఫాతిమా కుమారిడితో ఇండియాకు వచ్చింది. ఫయాజ్ అహ్మద్ కూడా పాకిస్థాన్ కు వెళ్లిపోయాడు.

ఫాతిమా తల్లిదండ్రులు పాకిస్థాన్ లోని ఫయాజ్ ను సంప్రదించారు. ఇండియాకు రావాల్సిందిగా కోరారు. తాము ఇక్కడ అన్ని చూసుకుంటామని ఫయాజ్ చెప్పారు. ఫయాజ్ 2022లో ఎలాంటి గుర్తింపు పత్రలు లేకున్నా నేపాల్ వెళ్లాడు. అక్కడికి ఫాతిమా తల్లితండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం వెళ్లారు. ఫయాజ్ తో మాట్లాడి అక్రమంగా అతన్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఫయాజ్ ఏడాది కాలంగా హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫయాజ్ కు గుర్తింపు పత్రాలు సాధించాలని జుబేర్ షేక్, అఫ్జల్ బేగం ప్లాన్ చేశారు.
ఆధార్ కార్డు కోసం ఫయాజ్ ను మాదాపూర్ లోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లారు. తమ కుమారుడు గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. ఫేక్ బర్త్ సర్టిఫికేట్ సడ్మిట్ చేశారు. అనుమానం వచ్చిన ఆధారు నిర్వహకులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫయాజ్ ను అదుపులోకి తీసకున్నారు. జుబేర్ షేక్, అఫ్జల్ బేగం పారిపోయారు. ఫయాజ్ ను కేంద్ర నిఘా వర్గాలు, కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు విచారించారు. హైదరాబాద్ విదేశీయులకు అడ్డగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యం పాతబస్తీలో చాలా మంది విదేశీలు అక్రమంగా నివస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సిమా హైదర్ అనే పాకిస్థాన్ కు చెందిన ఓ వివాహిత కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications