దారుణం: భర్తతో స్నేహంగా ఉంటోందని.. యువతిపై యువకులతో లైంగిక దాడి, నగ్న ఫొటోలు తీసి..

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్తతో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టింది. నలుగురు యువకులతో యువతిని లైంగిక దాడి చేయించింది. నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు గురిచేసింది. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆమెతోపాటు నిందితులు కటకటాలపాలయ్యారు.

తన భర్తతో యువతి ప్రవర్తనపై భార్య అనుమానం

తన భర్తతో యువతి ప్రవర్తనపై భార్య అనుమానం


వివరాల్లోకి వెళితే.. భర్త శ్రీకాంత్‌తో కలిసి నిందితురాలు గాయత్రి.. కొండాపూర్‌లో నివాసం ఉంటోంది. కొండాపూర్‌లోనే ఉంటున్న బాధితురాలు సివిల్స్ ప్రిపేర్ అవుతోంది. శ్రీకాంత్ కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతుండటంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని ఆ యువతిని కొండాపూర్‌లోని ఇంటికి పిలిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త శ్రీకాంత్, యువతి ప్రవర్తనపై గాయత్రి అనుమానం పెంచుకుంది.

యువతిపై అనుమానం.. ప్రైవేటు భాగాల్లో గాయాలు, లైంగికదాడి

యువతిపై అనుమానం.. ప్రైవేటు భాగాల్లో గాయాలు, లైంగికదాడి

ఈ వ్యవహారంపై ఏప్రిల్ 24న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే, ఆ తర్వాత కేసును ఇటీవల విత్ డ్రా చేసుకుని మాట్లాడాలంటూ బాధిత యువతిని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత పథకం ప్రకారం గదిలోకి తీసుకెళ్లి కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో ఆమెపై దాడి చేయించింది. గాయత్రి చెప్పడంతో.. ఆ యువకులు బాధిత యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు యువతి ప్రైవేట్ భాగాల్లో గాయాలు చేశారు.

యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన గాయత్రి

యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన గాయత్రి

బాధిత యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించారు. యువతిని నగ్నంగా చేయించి.. తన మొబైల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసింది గాయత్రి. దాడి ఘటన ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు పెడతానంటూ బెదిరింపులకు గురిచేసింది. యువకుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలు గాయత్రితోపాటు దాడికి పాల్పడిన యువకులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+