Alai Balai: ఈ నెల 6న అలయ్ బలయ్.. చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్
పండుగంటే.. అందరం ఒక చోట కలిసి ఆనందంగా ఉండడం.. యోగక్షేమాలు తెలుసుకోవడం.. ఈ ఉద్దేశంతోనే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొన్ని ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అలయ్ బలయ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఉన్నారు.
ఈ అలయ్ బలయ్ ప్రతీ సంవత్సరం దసరా పండు సందర్భంలో నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ
దసరా తర్వాతి రోజు అంటే ఈ నెల 6న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అలయ్ బలయ్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారని పేర్కొన్నారు.

గత 17 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెప్పారు. చిరంజీవితో పాటు, ఏపీ, హర్యానా, కేరళ గవర్నర్లు, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వస్తారని వెల్లడించారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా పంజాబీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖులకు సన్మానం చేస్తామ నిచెప్పారు.
తెలంగాణకు సంబంధించి అనేక వంటకాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఇప్పటికే ప్రముఖలకు ఆహ్వానాలు లేఖలు అందించామని తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications