హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్.. బీర్ల ధరలు తగ్గింపు, అన్నీ బ్రాండ్లపై రూ.10 తగ్గింపు..

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు గుడ్ న్యూస్. బీర్ ధరను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ రకాల బీర్లపై రూ.10 మేర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. సర్కార్ తమ కోసమే ధర తగ్గించిందని తెగ సంబరపడిపోతున్నారు.

బీర్ల ధ‌ర‌లను త‌గ్గిస్తూ రాష్ర్ట ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. బీరు సీసాపై రూ. 10 త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌త్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో సీసాపై రూ. 30 ప్ర‌భుత్వం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌త్యేక ఎక్సైజ్ సెస్ నుంచి రూ. 10 త‌గ్గించింది. ప్ర‌త్యేక సెస్ త‌గ్గింపు ఇవాళ్టి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

beer rate decreased in telangana state

ఇప్పటివరకు ఉన్న సెస్ ఇప్పుడే ఎందుకు తగ్గించిందనే ప్రశ్న తలెత్తింది. హుజురాబాద్ ఉప ఎన్నిక జిమ్మిక్కు అనే అనుమానం వస్తోంది. ఇప్పటికే దళిత నేతలతో సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం.. ఆ తర్వాత బీర్ల ధరలు తగ్గించడంపై సాధారణంగానే సందేహాలు వస్తాయి. కానీ అదేం లేదని ప్రభుత్వం సర్ది చెప్పుకునే అవకాశం ఉంది. కానీ అవీ పైపై మాటలు అని.. ముందుచూపుతోనే తగ్గించి ఉంటుందనే చర్చ జరుగుతుంది. బై పోల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రకటన చేయడం ఉండదు అని.. అందుకే ముందుజాగ్రత్త చర్య చేపట్టారని ఆరోపించే వారు ఉన్నారు.

English summary
beer rate decreased in telangana state today night. all brands one beer rs.10 decreased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X