దారుణం.. మరికొన్నిగంటల్లో పెళ్లి.. వరుడు బలవన్మరణం..
అసలే కరోనా వైరస్ బీభత్సం కొనసాగుతోంది. అనుకున్నంత మార్కెట్ లేదు. దీంతో ఏదో అలా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. అయితే పెళ్లిళ్లు/ ఫంక్షన్లకు కొంతమందే వస్తున్నారు. ఏదో చేయాలిగా అన్నట్టు చేసేస్తున్నారు కొందరు. అలాంటి సమయాల్లో కొన్ని అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. రంగా రెడ్డి జిల్లాలో కూడా వరుడు చనిపోయాడు. కాజువల్ డెత్ కాకుండా.. ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ కొసమెరుపు.
మరి కొన్నిగంటల్లో పెళ్లి పీఠలు ఎక్కాల్సిన వరుడు.. ఒకరోజు ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కు శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.. ఇంతలోనే శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు. కానీ గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు మాత్రం అలుముకున్నాయి.

ఆత్మహత్యకు సంబంధించి స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. పెళ్లి కుమారుడు మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
క్షణికావేశం ప్రాణం తీసిందా.. లేదా పెళ్లి అంటే నచ్చక యువకుడు సూసైడ్ చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. పెళ్లి కూతురు అంటే ఇష్టం లేకుంటే ఇంతవరకు ఎలా వస్తారని ప్రశ్న వస్తోంది. లేదంటే లవ్ ఎఫైర్ ఏమైనా ఉందా అనే ప్రశ్నలు సగటు జీవి మెదడును తొలచి వేస్తున్నాయి. కానీ దీనికి సమాధానం మాత్రం పోలీసుల విచారణలో తెలియనుంది. కానీ ఓ యువకుడు హఠాత్తుగా బలన్మరణం చెందడం మాత్రం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.












Click it and Unblock the Notifications