కవితతో కన్సల్ట్ కాలే, ఆమెనే కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంది: ధర్మపురి అర్వింద్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై చర్చ కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తన బిడ్డ, కల్వకుంట్ల కవితతో కూడా సంప్రదింపులు జరిపారని ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు. కవితతో సంప్రదింపులు జరపలేదని స్పష్టంచేశారు.
లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న కవితతో సంప్రదింపులు జరపాల్సిన కర్మ బీజేపీకి పట్టలేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గేతో కవిత సంప్రదింపులు జరిపిందని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చే సమయంలో కవితను పిలవలేదన్నారు. కేసీఆర్‌ను బెదిరించటానికే కవిత కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. అంతే తప్ప.. తాము మాత్రం డిస్కషన్ చేయలేదని కుండబద్దలు కొట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 20 సీట్లకు మించి రావని హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఫస్ట్ ప్లేస్ అని చెప్పకనే చెప్పారు. అలాగే పార్టీలో సీనియర్ నేతలను కలుపుకుపోవటం లేదనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. నియోజకవర్గ ఇంచార్జీల విషయంలో కొత్త, పాత నేతలను బాలెన్స్ చేశామని వివరించారు.
సీఎం కేసీఆర్ బీజేపీ సంప్రదింపులు జరిపిందని ఆరోపణలు చేశారు. ఆ కామెంట్లను అర్వింద్ కొట్టిపారేశారు. దాంతోపాటు కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉందని హాట్ కామెంట్స్ చేశారు. వారి సమస్యను తమపై తోయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. అర్వింద్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ దీనిపై సీఎం కేసీఆర్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలీ.












Click it and Unblock the Notifications