విజయశాంతి మెగా టార్గెట్ - అమీర్ ఖాన్ పై ఫైర్స్ : బిగ్ కాంట్రావర్సీ..!
హైదరాబాద్: లాల్ సింగ్ ఛద్దా. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగచైతన్య, మోనా సింగ్ నటించిన పాన్ ఇండియా మూవీ. ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతోంది. అద్వైత్ చందన్ దర్శకుడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. 1994లో హాలీవుడ్‌లో విడుదలైన కల్ట్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.

ప్రమోషన్లతో..
అక్కినేని నాగచైతన్య నటించిన మూవీ కావడం వల్ల అటు టాలీవుడ్‌లోనూ దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సుమారుగా 200 కోట్ల రూపాయలతో తెరకెక్కిందీ మూవీ. దీనికి అనుగుణంగా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోన్నారు. అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున సహా ఇతర టాప్ టాలీవుడ్ సెలెబ్రిటీస్ తమవంతు సహకారాన్ని అందిస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

మెగాస్టార్ సైతం..
టీవీ ఛానళ్లల్లో దీనికి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అవుతోన్నాయి. అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతోన్నారు. బాలరాజు అనే క్యారెక్టర్‌లో నాగ చైతన్య నటించాడీ మూవీలో. ఏపీలోని బోడిపాలెం అనే గ్రామం నుంచి ఆర్మీలో చేరిన యువకుడి పాత్రను పోషించాడు. మూడు తరాలకు ప్రతినిధిగా అతను కనిపించబోతోన్నాడు.

హ్యాష్‌ట్యాగ్‌తో..
ఒకవంక ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- విమర్శలు చుట్టుముట్టుతున్నాయి. అమీర్ ఖాన్ సినిమా కావడం వల్లే ఈ దుమారం చెలరేగుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. #BanLaalSinghChadda అనే హ్యాష్ ట్యాగ్ అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతగా విమర్శల దుమారం చెలరేగడానికి కారణాలేమిటనే స్పష్టతనూ ఇస్తోన్నారు.

విజయశాంతి ఫైర్..
ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకురాలు విజయశాంతి సైతం ఈ సినిమాపై స్పందించారు. లాల్ సింగ్ ఛద్దా సినిమా విషయంలో టాలీవుడ్ పెద్దలు అత్యుత్సాహాన్ని చూపిస్తోన్నారని ఆరోపించారు. ప్రమోషన్ సందర్భంగా- ప్రజలను అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్‌కు అర్థమయ్యేలా ప్రజలు చేస్తున్నారని అన్నారు.

ప్రజల్లో చైతన్యం..
కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వాన్ని కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తోన్నారని, ఆ ఉద్దేశంతోనే భారతమాతను అవమానించేలా ప్రవర్తిస్తోన్నారని ధ్వజమెత్తారు. ఈ సినిమాకి వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రజలందరినీ మేలు కొలుపుతున్నారని ప్రశంసించారు. జనం ఇంతగా చైతన్యంతో వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు దక్షిణాది హీరోలు మాత్రం వారి మనోభావాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

బీజేపీని వ్యతిరేకించేవారే..
ఆమీర్ ఖాన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీషోల్లో పాల్గొంటున్నారని ధ్వజమెత్తారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తోన్నారని, అది ఏ మాత్రం సమంజసం కాదేమోనని వారు ఆలోచించాలని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ చిత్రాన్ని ప్రమోట్ చేయడం సరైనది కాదేమోనని వారు గుర్తించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారే ఇలా చేస్తోన్నారని ధ్వజమెత్తారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే..












Click it and Unblock the Notifications