RGIA: సమ్మె చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు.. ప్రయాణికుల ఇబ్బందులు..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల స్ట్రైక్ చేస్తున్నారు. డ్రైవర్ల నిర్ణయం విమాన ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. క్యాబ్ అగ్రిగేటర్‌లకు తక్కువ ఛార్జీల కారణంగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ ధర్నాతో డ్రైవర్లు తమ సమస్యలను ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్‌లకు దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు.
క్యాబ్ అగ్రిగేటర్లు తక్షణమే ప్రీ-పెయిడ్ టాక్సీల ప్రభుత్వ ధరలను అమలు చేయాలని TGPWU డిమాండ్ చేస్తుంది. G.O. Ms. నం. 46 డిసెంబర్ 9, 2022 నాటిదని.. ఇటీవల, Gig వర్కర్స్ యూనియన్ కూడా తెలంగాణలో రాజస్థాన్ తరహా సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. క్యాబ్ డ్రైవర్ల ధర్నాకారణంగా అనేక మంది విమానయానదారులు హైదరాబాద్ విమానాశ్రయంలో అసౌకర్యానికి గురతున్నారు. దీంతో ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సరసమైన ప్రత్యామ్నాయ మార్గాలను గమ్యం చేరుకుంటున్నారు.

కొంతమంది నెటిజన్లు విమానాశ్రయంలో తమ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. "అధిక ఛార్జీలను డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేయడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది. ఛార్జీలు రూ. 1500కి పెరిగాయి" అని ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశారు."Olacabs - హైదరాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి 868INRకి క్యాబ్‌ను బుక్ చేసుకున్నా. టాక్సీ డ్రైవర్ మరో 300 అడిగాడు. లేకపోతే తనను లొకేషన్ లో డ్రాప్ చేయను అని చెప్పాడు. నా గమ్యాన్ని చేరుకోవడానికి అతనికి డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం లేదు" మరో వ్యక్తి చెప్పాడు.
జూన్ క్యాబ్ డ్రైవర్లు సమ్మె చేశారు. ఆ సమయంలో కూడా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. డ్రైవర్ల డిమాండ్లను క్యాబ్ అగ్రిగేటర్లు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. హైదరాబాద్ సిటీలో చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి క్యాబ్ లపై ఆధారపడతారు.












Click it and Unblock the Notifications