తెలంగాణపై సవతి ప్రేమ.. ఎలాంటి కేటాయింపులు లేవు: మంత్రి కేటీఆర్
నిర్మల పద్దుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఫైర్ అయ్యారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని ఎంత కోరినా పట్టించుకోవడం లేదన్నారు. బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను ప్రారంభించారు. జవహర్‌నగర్‌లో డంప్‌యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
నిన్న కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మాట్లాడిన సందర్భంగా కరోనా టైంలోనూ కేంద్ర ప్రభుత్వం దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఏ వర్గానికీ కేటాయింపులు పెంచలేదన్నారు. మరి ఎవరికి పెంచినట్లు ప్రశ్నించారు. బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎయిరిండియాను అమ్మారు...ఇప్పుడు ఎస్ఐసీ వంతు వచ్చిందన్నారు.

లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ ఉత్తి బోగస్ అని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాల్ల దేశ రైతాంగమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేసుకోవడానికి రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఇదే సమయంలో దేశ అభివృద్ధి పై, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే విషయాలపై దృష్టి సారించిన బడ్జెట్లో, వచ్చే మూడేళ్లలో భారత్ 400 కొత్త, ఇంధన-సమర్థవంతమైన వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలో రైల్వే రంగాన్ని కొత్త పుంతలు తొక్కించటంలో భాగంగా నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications