అధర్మానికి చరమగీతం.. కుమ్మక్కు కామెంట్స్‌పై కిషన్ రెడ్డి రియాక్షన్
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చింది. ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్యయ్యాయని మంత్రి హరీశ్ రావు కామెంట్స్ చేశారు. దీనిపై కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ మభ్యపెట్టినా ప్రజలు మరో చరిత్ర లిఖించారని కామెంట్ చేశారు. నైతిక విలువలకు, నీతికి, నిజాయితీకి మద్దతుగా ప్రజలు నిలబడ్డారని వివరించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

భయపడలే
అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా 60 శాతం మహిళలు బీజేపీకి అండగా నిలబడ్డారని కిషన్ రెడ్డి వివరించారు. ఐదు నెలల్లో హుజూరాబాద్‌లో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెండింగ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టినా.. అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. ధన రాజకీయాలకు హుజూరాబాద్ ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. డబ్బుకంటే మంచిపాలన ముఖ్యం అని ప్రజలు నిరూపించారని కిషన్ రెడ్డి తెలిపారు.

వ్యతిరేకం
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని కిషన్ రెడ్డి అన్నారు. అహంకారానికి, అధర్మానికి ప్రజలు చరమగీతం పాడారని కామెంట్ చేశారు. కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు గమనించారని వివరించారు. ప్రజల విశ్వాసం ముందు ధనం వృధా అని.. హుజూరాబాద్ ఎన్నికలు నిరూపించాయని తెలిపారు. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలను ముందు నుంచి అప్రమత్తం చేశాం అని తెలిపారు. నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యం అని ప్రజలు నిరూపించారని వివరించారు.

మోసం
టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక విజయావకాశాలపై ప్రధాని మోడీ ఇటలీ పర్యటనలో ఉండి ఆరా తీశారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి టీఆర్ఎస్ చేయని ప్రయత్నం, చెప్పని అబద్ధం లేదన్నారు. కేటీఆర్ ట్వీట్ చేయడం సరికాదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ కలసి పని చేశాయని మంత్రి హరీశ్ రావు కామెంట్ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులను తన పార్టీలో చేర్చుకుందన్నారు. ఈటల రాజేందర్ పట్ల టీఆర్ఎస్ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని.. ఆయనపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video

విజయమో
ఇటు హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య.. గెలిచి తీరాలని పట్టుబట్టారు. రాజీనామా చేసిన సమయం నుంచి ప్రజలతో కలిసిపోయారు. జనాలకు గిప్టులు ఇస్తున్నారని అధికార పార్టీ ప్రచారం చేసినా.. నిలువలేదు. వాస్తవానికి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈటల రాజేందర్ గెలుస్తాడని అంతా భావించారు. కానీ మెజార్టీ మాత్రం ఈ స్థాయిలో వస్తుందని అనుకోలే.. ఊహించలేదు. 10 వేల లోపు మెజార్టీ వస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ఈటల రాజేందర్.. కారుకు పంక్చర్ చేయడంతో కమలం వికసించింది.












Click it and Unblock the Notifications