కేసీఆర్- చినజీయర్ మధ్య గ్యాప్ నిజమేనా...? ముచ్చింతల్‌కు కేసీఆర్ నో.. యాదాద్రికి స్వామి డుమ్మా..
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మహాసంప్రోక్షణ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొనగా కార్యక్రమం పూర్తయ్యింది. అయితే చినజీయర్ స్వామి కనిపించలేదు. అంటే.. యాదాద్రి పున:నిర్మాణానికి అంకురార్పణ చేసిందే ఆయన.. ఆగమ శాస్త్రం ప్రకారం.. జీయర్ స్వామి సూచనలతోనే ఆలయ పున:నిర్మాణం జరిగింది. మరీ ఆయనను ఎందుకు హాజరుకాలేదు. కేసీఆర్ ఆయనకు పొసగడం లేదా..? ఇటీవల వస్తోన్న ఊహాగాలను ఇవాళ్టి ఘటన మరింత బలం చేకూర్చింది. ఇటీవల మీడియా సమావేశంలో కేసీఆర్ స్వయంగా.. అబ్బే అదేం లేదని మీడియా ప్రతినిధులతో చెప్పి అప్పటికీ తప్పించుకున్నారు. కానీ తర్వాత మాత్రం జరిగే తంతు అలానే జరిగింది.

మోడీ అటెండ్.. కేసీఆర్ మాత్రం నో...
ఇది ఇలా ఉంచితే.. ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు ఇటీవల జరిగాయి. ప్రధాని మోడీ కూడా వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. మోడీ వచ్చిన సమయంలో వెళ్లలే.. ఆ తర్వాత కూడా దూరంగా ఉన్నారు. దీంతో జీయర్ స్వామితో కేసీఆర్‌కు పడటం లేదు.
కానీ ఈ ఊహాగానాలపై కేసీఆర్ ఇంతకుముందే స్పందించారు. చినజీయర్‌తో గ్యాప్ ఉందని ఎవరన్నారు?.ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు స్పష్టంచేశారు. పైకి అలా గంభీరంగా అప్పుడు చెప్పిన.. నేడు నిజం ఏదో ఉందని అర్థం అవుతుంది.

మోడీ శ్రీరామచంద్రుడు.. కేసీఆర్‌కు కాలి ఉంటది..?
రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీని చినజీయర్ స్వామి ప్రశంసలతో ముంచెత్తారు. మోడీని శ్రీరామచంద్రునితో పోల్చారు. విగ్రహావిష్కరణకు మోడీ కన్నా అర్హులు భారతదేశంలో ఎవరూ లేరని కీర్తించారు. దీంతో కేసీఆర్‌కు మరింత ఆగ్రహం తెప్పించి ఉంటాయి. అందుకే కాబోలు రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరుతోపాటు వేడుకలు నిర్వహిస్తున్న చినజీయర్ స్వామి, మై హోం అధినేత రామేశ్వరరావుపై సీఎం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మహా విగ్రహావిష్కరణ ముగింపు రోజు జరగాల్సిన శాంతి కల్యాణాన్ని కేసీఆర్ కోసమే వాయిదా వేశారని ప్రచారం సాగింది. అయినా కేసీఆర్ వెళ్లలేదు.

కేసీఆర్ ఒక్కరే.. జీయర్ స్వామి నో
యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన.. మహాకుంభ సంప్రోక్షణను పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఆగమశాస్త్ర పండితులు నిర్ణయించిన సుముహూర్తం.. స్వస్తిశ్రీ చాంద్రనామ శ్రీప్లవనామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారం రోజున శ్రవణా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ ముహూర్తం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ చేపట్టారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చింది చినజీయర్ స్వామే.
ఆలయ పున:నిర్మాణం అంతా ఆయన సూచనలు, సలహాలతోనే నిర్మించారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణానికి ముగ్గు వేసిన చినజీయర్ స్వామి లేకుండానే ఉద్ఘాటన జరుగుతోంది. పిలిస్తే యాదాద్రి పోతామని చినజీయర్ మీడియాతో తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి కబురు చినజీయర్‌కు వెళ్లలేదు. పైకీ మాత్రం అందరూ ఆహ్వానితులే అన్నారు. తప్ప ప్రత్యేకంగా చినజీయర్‌ను ఆహ్వానించలేదు. దీంతో ఆయన కూడా మిన్నకుండిపోయారు. కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

పైకి అలా.. లోన మాత్రం
రెండు మహాఘట్టాలు జరిగిన సమయంలో ఇద్దరూ దూరంగానే ఉన్నారు. దీంతో వారి మధ్య గ్యాప్ ఉందని స్పష్టం అవుతోంది. ఇందులో అనుమానానికి తావులేదు. కానీ పైకి మాత్రం ఇద్దరూ అదేం లేదని అంటున్నారు. ఇటీవల జీయర్ స్వామి అయితే ఏకంగా సమ్మక్క సారాలమ్మపై కామెంట్స్ చేశారు. అదీ దుమారం రేగింది. తర్వాత సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి.. అయినా కేసీఆర్ మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదు. జీయర్ స్వామి కూడా తన పని తాను చేసుకొని వెళుతున్నాడు. రామేశ్వరరావు.. జీయర్ స్వామి కలిసి బీజేపీకి దగ్గరగా ఉన్నారనే కారణంతో కూడా కేసీఆర్ దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి వీరిద్దరీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఇలా.. మర భవిష్యత్‌లో ఏం జరగనుందో చూడాలీ మరీ.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications