KCR: తెలంగాణ ముందుకెళ్తుంటే.. దేశం వెనకబడుతుంది: కేసీఆర్

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంటే దేశం మాత్రం వెనకబడి పోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. దీనికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

CM KCR Fire on center government on development

మన గంగా యమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు సందర్భంగా ఎల్బీ స్టేడియం చుట్టపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+