ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని బవసతారకం ఆస్పత్రిలో క్యాన్సర్ తో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి ప్రభుత్వమే అన్నిరకాల వైద్యఖర్చులు భరిస్తుందని తెలిపారు. నవీన్ విషయం తెలిసిన వెంటనే రేవంత్ దీనికి సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. రెండు రోజుల క్రితం నవీన్ అనే 18 సంవత్సరాల యువకుడు బ్లడ్ క్యాన్సర్‌తో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు.
చికిత్సకు భారీగా నగదు అవసరపడుతుందని వైద్యులు తెలిపారు. బాధితుడికి బీమా సౌకర్యం కూడా లేకపోవడంతో కొందరు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ ను ట్యాగ్ చేస్తూ విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన రేవంత్ బాధితుడికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనిపై బాధితుడితోపాటు అతని కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ ను పరామర్శించేందుకు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఓ మహిళ రేవంతన్నా అని పిలిచిన విషయం తెలిసిందే. ఆమె దగ్గరకు వెళ్లిన రేవంత్ వివరాలను తెలుసుకొని అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రధానమంత్రితోపాటు ఆదిలాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సహకారం అందించాలని మోడీని కోరారు. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని, రాజకీయాలనేవి ఎన్నికల సమయంలోనే చూసుకోవాలని, మిగతా విషయాల్లో అన్నదమ్ముల్లా కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలన్నారు. తెలంగాణకు అవసరమైనటువంటివాటిని రేవంత్ మోడీముందుకు తీసుకువచ్చారు. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని, ఐఐఎంను కేటాయించాలని, సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
It's painful to learn about Naveen, who is battling rare cancer at such a young age.
— Revanth Reddy (@revanth_anumula) March 4, 2024
I’ve directed the authorities to contact his family and make all necessary arrangements for treatment. The government will bear the expenses and make the necessary arrangements for the… https://t.co/8vSc4gVIf4












Click it and Unblock the Notifications