ఎల్లుండి రాష్ట్రానికి మోడీ.. ఈ చోట్ల పర్యటన, భద్రతపై సీఎస్ సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లుండి (5వ తేదీ శనివారం) రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ క్రమంలో అధికారులు తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ముచ్చింతల్, ఇక్రిసాట్‌కి ప్రధాని మోడీ వస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా భద్రత విషయంలో పొరపాటు కూడా ఉండకూడదని అధికారులకు స్పష్టంచేశారు.
బందోబస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించిన సీఎస్.. మోడీ పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక్రిశాట్‌లో జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో మోడీ పాల్గొనబోతున్నారు. ఇటీవల పంజాబ్ పర్యటనలో ఉద్రిక్త నేపథ్యంలో తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

శంషాబాద్ ముచ్చింతల్ చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో నిర్వహిస్తోన్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. వేదికల వద్ద తగిన వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను కూడా ఆదేశించారు.
వీవీఐపీలు కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలని, వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేశారు. కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాస్తవానికి రాష్ట్రంలో కరోనా కేసులు అంతగా లేవు. క్యాజువల్ కేసులు వస్తున్నాయి. ఏపీలో కూడా తగ్గుతున్నాయి. వైద్య నిపుణులు కూడా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. కానీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్నీ ప్రీకాషన్స్ తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications