Hyderabad: వీడు మామూలోడు కాదు.. చొక్కాలో 800 గ్రాముల బంగారాన్ని దాచాడు..
పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న విదేశాల నుంచి భారత్ కు బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు రోజుకో పద్ధతిలో స్వర్ణాన్ని దేశానికి అక్రమంగా తీసుకొస్తున్నారు. రకరకాల పద్ధతుల్ల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు.
శంషాబాద్
సోమవారం ఆర్‌జీఐ శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 800 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ గౌస్ ఖాన్ అనే వ్యక్తి షర్ట్ లో 804 గ్రాముల బంగారం దాచి కుట్టేయించాడు. అదే షర్ట్ ధరించి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగాడు. అధికారులు అతన్ని చూసి అనిమానించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.

తనిఖీలు చేసినా
షర్ట్ కొంచె డిఫరెంట్ గా కనిపించడంతో షర్ట్ ను కత్తెరతో కట్ చేశారు. దీంతో అందులోని బంగారం బయటపడింది.విమానం దిగిన తర్వాత తనిఖీలు చేసినా నిందితుడి వద్ద ఏమీ దొరకలేదని అధికారులు తెలిపారు. కానీ అతను అనుమానాస్పందంగా కనిపించినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications