వామ్మో.. ఏమీ ఎండలు.. మార్చిలోనే పగులుతున్న మాడు..
మార్చిలోనే మాడు పగులుతుంది. ఇక ఏప్రిల్, మే నెలలో చుక్కలే కావచ్చు. బయటకు వెళితే చాలు.. భానుడి భగ భగకు మాడి మసికాక తప్పడం లేదు. తెలంగాణ
రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరి తల ద్రోణి ఈరోజు విదర్భనుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వరకు కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వచ్చే మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. సో ఎండ కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి వేడి ఎక్కువ అవుతుంది. సాయంత్రం కూడా వేడి గాలి వీస్తోంది. దీంతో జనం దాదాపుగా బయటకు రావడం లేదు. ఇంపార్టెంట్ పనులు ఉంటే తప్ప.. ఎక్కడివారు అక్కడే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేడి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో పగలు ఎండ, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
పల్లెల్లో ఫరవాలేదు.. కానీ నగరాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇంటి నుంచి బయటకు వెళితే ఉక్కపోతతో అల్లాడిపోవాల్సిందే. ఎండల నుంచి రక్షణగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications