Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. టీఎంఎఫ్‌సీ ఆధ్వర్యంలో పలు కోర్సులకు ఉచిత శిక్షణ.. !
తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో ఐటీ, హెల్త్‌కేర్ సహా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఉచిత శిక్షణ కోర్సులు అందించనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలను అక్టోబర్ 4లోగా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాలని కోరారు.శిక్షణ ఉపాధి, ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ పథకం ప్రకారం TMFC ఈ కోర్సులను అందిస్తుంది.
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC), TASK, MEPMA, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (BIE), రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి అక్రిడిటేషన్ గుర్తింపు ఉన్న శిక్షణా సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీ స్కిల్స్ లో డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, వెబ్ డిసైనింగ్, గ్రాఫిక్ డిసైనింగ్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, 3డీ యానిమేషన్, వీఎఫ్ఎక్స్, యాప్ డేవలప్ మెంట్, హర్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ కోర్సులు ఉన్నాయి.

ఎడ్యూకేషన్ లో ప్రీ ప్రైమరీ టీచింగ్ ట్రైనింగ్ కోర్సు ఉంది. హెల్త్ లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, జనరల్ డ్యూటీ హెల్త్ అసిస్టెంట్ కోర్సులు ఉన్నాయి. అకౌంటింగ్ లో జూనియర్ సీఏ, ట్యాలీ, ఐటీఅండ్ జీఎస్టీ కోర్సులు ఉన్నాయి. కన్ స్ట్రక్షన్ స్కీల్స్ లో ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్ సూపిరియర్, ఇంటిరియల్ డిసైనింగ్ కోర్సులు ఉన్నాయి. వెటర్నిటీ విభాగంలో వెటర్నిటీ అండ్ డైరీ డెవలప్ మెంట్ కోర్సులు ఉన్నాయి. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో ఫ్యాషన్ డిసైనింగ్, గ్రామ్మెంట్ మ్యానిఫాక్చరింగ్, అడ్వాన్స్ బ్యూటిఫికేషన్ మేకప్ కోర్సులు ఉన్నాయి.
హర్టికల్చర్ విభాగంలో హర్టికల్చర్, నర్సరి టెక్నిషియన్ కోర్సులు ఉన్నాయి. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో హోటల్ అండ్ ఇవెంట్ మేనేజ్మెంట్, ఎయిర్ హోస్టర్స్, ప్లైట్ అటెండెంట్ కోర్సులు ఉన్నాయి. డ్రైవింగ్ విభాగంలో లైట్ మోటర్ వెహికల్, హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రనిక్స్ లో హౌస్ హోల్డ్ ఎలక్ట్రనిక్స్ అప్లియన్స్, ఫైర్అండ్ సెఫ్టీ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విభాగంలో స్మార్ట్ ఫోన్ రిపేరింగ్, ప్యాకింగ్, ఫార్నిచర్ మ్యానిపక్చరింగ్ కోర్సులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications