వావ్.. మత్తు ఇవ్వకుండానే సర్జరీ, గాంధీ వైద్యుల రేర్ ఆపరేషన్..
సర్జరీ అంటే ఎవరైనా సరే పరుగు తీస్తారు. వామ్మో.. నాకొద్దు అంటారు. మేజర్ ఆపరేషన్ అయితే స్పైనల్‌కు అనస్థీషియా తప్పనిసరి. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఫీట్ సాధించారు. అవును.. ఓ సర్జరీ చేశారు. కానీ మత్తు మందు లేదు.. ఏమీ లేదు... కానీ ఆ రోగికి సినిమా చూపించారు. వావ్ వైద్యులు అని సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

మత్తు ఇవ్వకుండానే..
ఓ మహిళా రోగికి అనస్తీషియాతో పనిలేకుండా సినిమా చూపిస్తూ.. మెదడులో ఏర్పడిన కణితిని తొలగించారు. అవేక్ క్రేనియటోమీగా పిలిచే సర్జరీని గాంధీ ఆస్పత్రి న్యూరో సర్జరీ విభాగం, అనస్తీషియా విభాగానికి చెందిన వైద్యులు కలిసి నిర్వహించారు. ఆ మహిళ అభిమాన నటీనటుల గురించి తెలుసుకున్నారు. ఆమెకు చిరంజీవి, నాగార్జున అంటే ఇష్టమని చెప్పారు. చిరంజీవి అడవిదొంగ సినిమా తన ఫేవరెట్ అని తెలిపారు. ఆ సినిమాతో పాటు నాగార్జున నటించిన మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే సినిమా సంతోషం చూపిస్తూ సర్జరీ నిర్వహించారు.

పాటలు వినిపిస్తూ..
సర్జరీ సమయంలో ఆమెకు ఇష్టమైన పాటలు కూడా చూపించారు. న్యూరో సర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ నాగరాజు, అనస్తీషియా విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవితోపాటు పలువురు వైద్యులు, నర్సులు, వార్డ్ బాయ్‌లు ఈ సర్జరీ చేశారు. స్మార్ట్‌ఫోన్‌లో సినిమా ప్లే అవుతుండగా వైద్యులు ఆపరేషన్ ప్రారంభించారు. సినిమాకు సంబంధించి నర్సులు రోగిని ప్రశ్నలు అడిగారు.

నొప్పి తెలియలే
ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ రోగికి ఎలాంటి నొప్పీ తెలియలేదు. సినిమా చూస్తూ వైద్య సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ జరిగింది. సినిమా ప్లే అవుతుండగా.. మహిళ సమాధానాలు చెబుతుండగా.. వైద్యులు సర్జరీ చేశారు. ఇలాంటి చికిత్స విదేశాలకో లేదంటే కార్పొరేట్ ఆస్పత్రులకో పరిమితం కాదని వైద్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications