658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దు..స్టాప్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి: షర్మిల
సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు వైఎస్.షర్మిల. మీకు మనసనేది లేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్టాఫ్ట్ నర్సులుగా సెలెక్ట్ అయ్యి.. పోస్టింగులు పొందలేకపోయిన అభ్యర్థులతో వీడియా కాన్ఫరెన్స్ జరిగింది. ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో షర్మిల పాల్గొన్నారు. తమ గోడును స్టాప్ నర్సు అభ్యర్థులు వెల్లబోసుకున్నారు.

658 మంది పక్కనపెట్టింది
2017లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2018లో పరీక్ష నిర్వహించగా.. 2021 ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించారు. కటాఫ్ మార్కుల ఆధారంగా 3,170 మంది అర్హత సాధించారని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 3076 మంది సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి, అందరినీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని కమిషన్ తెలిపిందన్నారు. 2,418 మందిని మాత్రమే ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ, మిగతా 658 మందిని ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టిందని తెలిపారు.
కాంట్రాక్ట్ పద్దతితో నియమించడం ఏంటీ
కరోనా విజృంభిస్తున్న వేళ సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులను పక్కన బెట్టి.. కాంట్రాక్టు పద్ధతిన వైద్య సిబ్బందిని నియమించడం ఏంటీ అటని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు హయాంలో అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తున్న సమయంలో.. సీఎం పదవీని కూడా కాంట్రాక్టు పెట్టుకుంటే సరిపోదా అని కేసీఆర్ అన్న మాటలను గుర్తుచేశారు. చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగాలకు కిటికీలు తెరిస్తే.. మీరు తలుపులు తెరవడాన్ని ఏమనాలని వైఎస్.షర్మిల ప్రశ్నించారు.

పీఆర్సీ నివేదిక ప్రకారం
పీఆర్సీ నివేదిక ప్రకారమే వైద్య, ఆరోగ్యశాఖలో 23,724 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సమయంలో ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. గత ఏడాది బడ్జెట్ లో ఆరోగ్యశాఖకు 3. 3శాతం నిధులు కేటాయించిన ప్రభుత్వం.. కరోనా సమయంలో ఈ ఏడాది అధిక నిధులు కేటాయించడం పోయి.. 2.7 శాతం నిధులు మాత్రమే ఇచ్చి.. ప్రజారోగ్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థంకావడం లేదన్నారు. కొత్త ఆసుపత్రులను నిర్మించాలని.. మరో 50 వేల వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. స్టాఫ్ ను నియమించే ముందు.. మీ నిర్లక్ష్యానికి నష్టపోతున్న 658 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి
సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులందరికీ తక్షణమే పోస్టింగులు ఇవ్వాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు.. నర్సింగ్ సంబంధించిన పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా పర్మినెంట్‌గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగ యువత మరిన్ని అఘాయిత్యాలకు పాల్పడక ముందే.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాల్సిన అవరసముందన్నారు. సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులంతా ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్య పడొద్దని షర్మిల భరోసానిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన రాణి, నాగజ్యోతి, రజని, లక్ష్మీ, ప్రియదర్శిని, కృష్ణవేణి, కిరణ్మయి, ఇసాక్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications