Hyderabad Rain: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కావురి హిల్స్, జూబ్లీహిల్స్, అయ్యప్ప సొసైటీ, కాకతీయ సొసైటీ, బోరబండ, మోతినగర్, ఎస్సాఆర్ నగర్, అమీర్ పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, రహమత్ నగర్, కృష్ణ నగర్ లో వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్డల మీదికి నీరు చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా మాదాపూర్ చౌరస్తాలో వాహనాలు భారీగా నిలిచాయి.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బోరబండ, సనత్‌నగర్‌, ఎస్సాఆర్ నగర్, ఎర్రగడ్డ, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, మలక్‌పేట, మధురానగర్‌ లో వర్షం కురిసింది. నగరంలో గత వారం పది రోజులుగా నిత్యం ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి పూట వాన పడుతుంది. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rain lashed Some parts of Hyderabad on Tuesday evening

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తర వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొమరిన్ ఏరియాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉందని.. దీని ప్రభావంతో వానలు పడతాయని తెలిపింది. బుధవారం మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని తెలిపింది. గత నాలుగు నెలలుగా తెలంగాణలో 30 శాతం అధికంగా వానలు పడినట్లు పేర్కొన్నారు. ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో 962.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు అయింది. 100 మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా.. 20 జిల్లాల పరిధిలోని 291 మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదు అయింది. ఇక 216 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+