CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బాలకృష్ణ కూతురు..

భారీ వర్షాలతో అల్లాడి పోయిన తెలుగు రాష్ట్రాలకు సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలిచారు. ఇరు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి నందమూరి బాలకృష్ణ రూ.50లక్షలు విరాళంగా అందించారు. కొద్ది రోజులు విరాళం ప్రకటించగా.. శుక్రవారం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ రూ.5కోట్లు విరాళంగా అందించింది.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి. నారాయణరెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చారు. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పేను సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ నేతలు కోరిన సంగతి తెలిసిందే.

Hero Balakrishna s daughter Tejaswini presented the check along with CM Revanth Reddy

పోలీసులు కూడా తమ ఒక్క రోజు వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చారు. పోలీసుల ఒక జీతం రూ.11 కోట్ల ,06,83,571 చెక్‎ను డీజీపీ జితేందర్, ఇతర పోలీసులు అధికారులు సెప్టెంబర్ 11న సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ ముఖ్యమంత్రి సహాయ నిధికి అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆమె రేవంత్ రెడ్డిని కలసి 50 లక్షలు చెక్ అందించారు.

సోను సూద్ ఏపీ, తెలంగాణకు కోటి చొప్పున రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ఏపీ తెలంగాణకు కోటి చొప్పున రెండు కోట్ల విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ఇచ్చారు. మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు. విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 5 లక్షల చొప్పున ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తెలంగాణకు విరాళం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+