హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కరోనా, రిజిస్ట్రార్‌కు కూడా.. ఎగ్జిబిషన్‌పై నో..

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ భయం.. కరోనా కేసులతో సిచుయేషన్ రోజు రోజుకు మారుతుంది. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్లతో సమస్య ఉంది. అయితే రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ కూడా కరోనా బారిన పడ్డారు. చీఫ్‌ జస్టిస్‌తోపాటు రిజిస్ట్రార్‌ జనరల్‌ నాగార్జునకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని వారు కోరారు.

అంతకుముందు ఇవాళ వివిధ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 2019లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం ఎగ్జిబిషన్‌ను నిలిపివేయడం సమంజసం కాదని ఎగ్జిబిషన్ సొసైటీ కోర్టుకి తెలిపింది. థియేటర్లు, మాల్స్ కు లేని ఆంక్షలు ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారని కోర్టు దృష్టికి తెచ్చింది. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

high court cji and register infected corona positive

ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోగలదని కామెంట్ చేసింది. కోవిడ్ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ కొనసాగాలా? వద్దా? అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు, ఫైర్‌, జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ వివరణతో 2019 అగ్నిప్రమాదంపై విచారణను హైకోర్టు ముగించింది. వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలనే ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నుమాయిష్ జరిగే అవకాశం లేదు. గుంపులు గుంపులుగా తిరగడానికి అవకాశం ఉండొద్దు. అందుకోసమే ఎగ్జిబిషన్‌పై కోర్టు కూడా అనుకూలంగా తీర్పును ఇచ్చింది.

English summary
high court cji and register infected corona positive. cji suggested to who met him do the corona test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X