Hyderabad: హైదరాబాద్ కు భారీగా చేరుకున్న గొర్రెలు, మేకలు..!

ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే భావించే బక్రీద్ పండుగకు హైదరాబాద్ నగర్ ముస్తాబావుతోంది. ఇప్పటికే అన్ని మసీదుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈద్ అల్ అధాకు ముందు ఖుర్బానీ కోసం మేకలు, గొర్రెలు కొనుగోలు చేసే సాంప్రదాయ పద్ధతి కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఖుర్బానీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇది అందించే సేవల కారణంగా ప్రజాదరణ పెరుగుతోంది. ఖుర్బానీ సేవలో జంతు సేకరణ నుంచి మాంసం డోర్ స్టెప్ డెలివరీ వరకు మొత్తం ప్రక్రియ ఉంటుంది.

హైదరాబాద్‌లోని అత్తాపూర్ నివాసి ఇర్షాద్ అహ్మద్ గత కొన్నేళ్లుగా ఖుర్బానీ సేవను ఎంచుకోవడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బక్రీద్ సందర్భంగా సాధారణంగా అధిక డిమాండ్ ఉన్న కసాయి(కటిక వారు) కోసం వెతకడానికి ఇబ్బంది లేకుండా పండుగను పూర్తిగా ఆస్వాదించవచ్చని ఆయన అన్నారు.ఖుర్బానీ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో, హైదరాబాద్‌లోని అనేక సంస్థలు మరియు వ్యాపారులు బక్రీద్‌కు ముందు వాటిని అందించడం ప్రారంభించారు.

Huge sheep and goats were brought to Hyderabad for Bakrid

ఈ ప్రొవైడర్లు మేకలు, గొర్రెలు కొనుగోలు, వధించడం, కస్టమర్ల ఇంటి గుమ్మాలకు మాంసాన్ని డెలివరీ చేయడం వంటి అన్ని అంశాలను కవర్ చేసే సమగ్ర ప్యాకేజీలను అందిస్తారు. కస్టమర్‌లు మొత్తం సర్వీస్‌కు ఏకమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం నాడు భారతదేశంలో ధుల్-హిజ్జా నెలవంక కనిపించడంతో జూన్ 8 ఇస్లామిక్ నెల మొదటి రోజుగా గుర్తించారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి అనేక ఇతర దేశాలతో పాటు జూన్ 17 న ఈద్ అల్ అదా జరుపుకోనున్నారు.

పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం జూన్ 17న సెలవు ప్రకటించింది. బక్రీద్ సందర్భంగా చాలా మంది ముస్లింలు మేకలు, గొర్రెలు కోస్తారు. దీంతో ఈ టైమ్ వాటికి భారీగా గిరాకీ ఉంటుంది. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్​తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలను సిటీకి తీసుకొస్తున్నారు. మెహిదీపట్నం, లంగర్ హౌస్​రింగ్ రోడ్, టోలిచౌకి, జియాగూడ, అంబర్ పేట, కాచిగూడ, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్ తదితర ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+