షాకింగ్: తండ్రి ల్యాప్‌టాప్‌లో కుమార్తె నగ్న చిత్రాలు, తల్లీకూతుళ్ల ఫిర్యాదు
హైదరాబాద్: నగరంలోని నాచారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమార్తె నగ్న చిత్రాలు తీసిన సవతి తండ్రి.. తన ల్యాప్‌టాప్‌లో పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ల్యాప్‌టాప్‌లో తన ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురైన కుమార్తె తన తల్లికి ఆ విషయం తెలిపింది. మొదటి భార్య చనిపోవడంతో రాజేష్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
ఈ రెండో భార్య కుమార్తె ఫొటోలు తీసి ల్యాప్‌టాప్‌లో దాచుకోవడంపై తల్లి, కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల క్రితం తన ఫొటోలను తనకుతెలియకుండా తీశాడని, ఇప్పుడు తాను చూసి షాకయ్యానని బాధితురాలు తెలిపారు. ప్రస్తుతం 20ఏళ్ల ఈ బాధితురాలు న్యాయవిద్యను అభ్యసిస్తోంది.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కరోనాతో ఉన్న రాజేశ్‌ను గత వారం పోలీసులు అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. ఇక ఇప్పుడు కరోనా నుంచి కోలుకోవడంతో నిందితుడ్ని మరోసారి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది ఇలా వుండగా, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె చందర్ కుమార్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాధితురాలు సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు అనంతరం ఆరోపణలు నిజమని తేలడంతో ఇన్‌స్పెక్టర్ చందర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసు శాఖలో ఇలాంటి చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే 9490616555 నెంబర్‌కు వాట్సాప్ సందేశం పంపించాలని సీపీ సూచించారు.












Click it and Unblock the Notifications