Hyderabad: రాత్రి 12:30 గంటలకు ఉప్పల్ నుంచి మెట్రో రైలు..
ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్ననేషనల్ స్టేడియంలో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో స్పెషల్ ట్రైన్ నడపనుంది.
అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకునేలా చూడడానికి, మ్యాచ్‌కు రెండు గంటల ముందు రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా ట్రైన్ నడపనున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత, చివరి రైలు 12.30 గంటలకు స్టేడియం స్టేషన్ నుండి బయలుదేరనుంది. అయితే ఈ ట్రైన్ లో ఉప్పల్ స్టేడియం స్టేషన్ వద్ద ఎక్కితే.. తర్వాత ఎక్కడా కూడా ఎక్కడానికి అవకాశం లేదు.

కేవలం దిగడానికి మాత్రమే అవకాశం ఉంది. మ్యాచ్ చూసే వారు రోడ్డు మార్గంలో వెళ్తే ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే మెట్రోలో వస్తే త్వరగా స్టేడియం వద్దకు చేరుకోవచ్చు.
అలాగే మ్యాచ్ అనంతరం త్వరగా ఇంటికెళ్లవచ్చు. హైదరాబాద్, పంజాబ్ మ్యాచ్ తో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు కూడా విధించారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే భారీ వాహనాలకు మాత్రం ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని చెప్పారు.
వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు-చెర్లపల్లి-ఐఓసీఎల్-ఎన్‌ఎఫ్‌సీ రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. ఎల్‌బీనగర్ నుంచి నాగోల్ వైపు వెళ్లే ఈ వాహనాలను.. నాగోల్ మెట్రో స్టేషన్ వైపు నుంచి హెచ్‌ఎండీఏ-బోడుప్పల్-చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు మీదుగా, మల్లాపూర్ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను.. నాచారం ఐడీఏ నుంచి చెర్లపల్లి-చెంగిచెర్ల మీదుగా మళ్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications