Hydra: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. ఎక్కడంటే..!
హైదరాబాద్ లో హైడ్రో కూల్చివేతలు కొనసాగుతోన్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) శనివారం ఫిల్మ్ నగర్‌లో ఫిర్యాదుల ఆధారంగా ప్రధాన రహదారులపై అనధికారిక నిర్మాణాలను ధ్వంసం చేసింది. మొదటగా ఈ నిర్మాణాలకు సంబంధించి తనిఖీలు చేశారు. ఇంటి సరిహద్దు గోడ, షెడ్‌తో సహా నిర్మాణాలు రహదారిని ఆక్రమించినట్లు ధృవీకరించిన అనంతరం కూల్చివేశారు. ఆదివారం శాస్త్రిపురం, వట్టేపల్లి రోడ్, జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌తో సహా హైదరాబాద్‌లోని పలు రద్దీ ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించారు.
పబ్లిక్ యాక్సెస్, రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ డ్రైవ్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, దుకాణాల ముందు నిర్మించిన షెడ్‌లను తొలగించారు.
ఫుట్‌పాత్‌లపై అనధికారిక నిర్మాణాలు ట్రాఫిక్ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయని హైడ్రో పేర్కొంది. ఫుట్‌పాత్ ఆక్రమణల గుర్తించి తొలగించాలని హైడ్రా కమిషనర్ A.V. రంగనాథ్ బృందాలను ఆదేశించారు. హైదరాబాద్‌లో రద్దీగా ఉండే రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు.

నగరవ్యాప్తంగా అక్రమ ఆక్రమణలను తొలగించడానికి హైడ్రా,ట్రాఫిక్ పోలీసుల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. హైదరాబాద్ లో చాలా చోట్ల ఫుట్ పాత్ లను ఆక్రమించారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఉంది. పైగా ఫుట్ పాత్ లో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాలకు వచ్చే వారు వాహనాలను రోడ్డు పైనే నిలపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో చాలా మంది హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను క్షుణ్ణంగా సమీక్షించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోరారు.
జీహెచ్ఎంసీ సమీక్షను పూర్తి చేసిన తర్వాత ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించనున్నారు. హైడ్రా ఇప్పటికే చాలా ఎకరాల ప్రభుత్వం భూమిని రక్షించింది. హైడ్రా చర్యలపై కొందరు కోర్టుకు వెళ్లడంతో హైడ్రా దూకుడు తగ్గింది.












Click it and Unblock the Notifications