TSPSC Paper Leak : 46 మంది అమ్మాయిలతో న్యూడ్ కాల్ మాట్లాడిన ప్రవీణ్.. ఇంకేం చేశాడంటే..!
ఏఈ పేపర్ లీక్ సంబంధించి సిట్ నివేదిక ఆధారంగా టీఎస్‍పీఎస్సీ నిర్ణయం తీసుకోనుంది.
టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పేపర్ లీక్ పై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు మొదలు పెట్టింది. ప్రవీణ్ కు సంబంధించి కొన్ని కీలక విషయాలు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ 46 మంది మహిళలతో న్యూడ్ కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మహిళలకు కూడా పేపర్ లీక్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్, రాజశేఖర్ ఇద్దరు కలిసి పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తోంది.

సిస్టం అడ్మిస్ట్రేటర్
టీఎస్‍పీఎస్సీ సిస్టం అడ్మిస్ట్రేటర్ గా ఉన్న రాజశేఖర్.. టెక్నికల్ సర్వీసేస్ డిపార్ట్ మెంట్ నుంచి డిప్యూటేషన్ పై టీఎస్ పీఎస్సీకి వచ్చాడు. కాగా ఈ కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్, రేణుక, రేణుక భర్త డాక్యా, రాజేశ్వర్ నాయక్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, రాజేంద్రనాయక్ ఉన్నారు. వీరిని మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్
కార్యదర్శి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో శంకరలక్ష్మి సిస్టమ్ లో లాగిన్ అయిన రాజశేఖర్ ఏఈ పేపర్ ను ప్రవీణ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి ప్రవీణ్ కు ఇచ్చాడు. ప్రవీణ్ ప్రశ్నపత్రాలను ప్రింట్ కూడా తీసుకున్నాడు. పేపర్లను రేణుక, ఆమె భార్త డాక్యాకు ఇచ్చాడు. ఆ తర్వాత రేణుక దంపతులు పేపర్లు అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ తో 13.5 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు.

రూ.10 లక్షలు
అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. వారిద్దరితో పాటు రాజేంద్ర నాయక్ ను మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకెళ్లిన డాక్యా... మార్చి 5న అభ్యర్థులను తీసుకుని సరూర్ నగర్ లోని పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయించిన అనంతరం వెళ్లిపోయాడు. రేణుక, డాక్యా దంపతులు ప్రవీణ్ కుమార్ కు మార్చి 2న రూ.5 లక్షలు, 6న మరో రూ.5 లక్షలు ఇచ్చారు. ఏఈ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ నివేదిక తర్వాత టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications