KTR: ఉప్పల్ స్కైవాక్‍ను ప్రారంభించిన కేటీఆర్..
పాదచారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు దాటేందుకు ఉప్పల్ చౌరస్తాలో రూ.36.50 కోట్ల ఖర్చుతో స్కైవాక్ నిర్మించారు. ఈ స్కైవాక్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. నేచి ఈ స్కైవాక్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికలు రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు.. ఉప్పల్ వైపు నుంచి రామంతాపూర్ వైపు.. నాగోల్ వైపు నుంచి హబ్సీగూడ వైపు.. అబ్సీగూడ వైపు నుంచి నాగోల్ వైపు పాదచారులు స్కైవాక్ ద్వారా భద్రంగా రోడ్డు దాటొచ్చు.
స్కైవాక్ లో లిఫ్ట్ తో పాటు ఎస్క్ లేటర్ కూడా ఉంది. వృద్ధులు లిఫ్ట్ ద్వారా స్కైవాక్ ఎక్కి రోడ్డు దాటొచ్చు. స్కైవాక్ లో8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు ఉన్నాయి. మొత్తం 37 పిల్లర్లు, 660 మీటర్ల పొడవు, 6 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. భాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ చేశఆరు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ నిఘా ఉంచారు. ప్రయాణికులు భద్రంగా ఉండేందుకు స్కైవాక్ కు ఇరువైపులా రెయిలింగ్ కూడా ఏర్పాట్లు చేశఆరు.

ఈ స్కైవాక్ లో ఆరు చోట్ల ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. స్కైవాక్ ప్రారంభం అనంతర కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే మైండ్ స్పేస్ లో స్కైవాక్ అందుబాటులో ఉంది. తాజాగా ఉప్పల్ చౌరస్తాలోకి స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మెహదీపట్నంలో కూడా స్కైవాక్ అందుబాటులోకి రానుంది.
అంతకుముందు హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో లూలూ గ్రూప్ తెలంగాణలో కార్యకలాపాలు మొదలు పెట్టింది.రాష్ట్రంలో లూలూ సంస్థ పెట్టుబడులతో టూరిజం పెరుగుతుందని భావిస్తున్నామన్నామని కేటీఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications