Hyderabad Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. తోలతట్టు ప్రాంతాలు జలమయం..!
ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, బేగంబజార్, నార్సింగి, మణికొండ, గండిపేట, బండ్లగూడ, అత్తాపూర్ వర్షం కురిసింది. బాచుపల్లి, మియాపూ, కుత్బుల్లాపూర్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోఠిలో వాన పడింది.
ఈదురు, గాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ మాన్ సూన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి చల్లపడడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఈ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశ ఉందని అంచనా వేసింది. సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడతాయని అంచనా వేసింది. పల్నాడు, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జల్లుల నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications