హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగర్ బరిలో జనసేన.. అభ్యర్థి ఎవరంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా...

|
Google Oneindia TeluguNews

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఇండికేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్‌తోపాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు ఉన్న క్యాడర్, అభిమానులతో కలిసి.. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది.

తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..?తెలంగాణ బీజేపీకి గట్టి షాకివ్వనున్న పవన్...? సాగర్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేసే యోచన..?

అభిమానులను పార్టీలోకి ఆహ్వానించాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు. సామాజిక వర్గాలకు ఆకట్టుకునేలా పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్ష సాధన కోసమే జనసేన పోరాటం నినాదంతో జనసేన పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అభిమానులను క్యాడర్ మార్చుకోవడమే లక్ష్యంగా తెలుస్తోంది.

janasena will be contest nagarjuna sagar by poll

తెలంగాణ నుంచి ఉద్యమం ప్రారంభం అవుతోందని జనసేన తెలిపింది. దీనికి అనుగుణంగా ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపనుంది. సాగర్ ఉప ఎన్నిక కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గ కమిటీలు వేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోమని.. కానీ బరిలోకి దిగుతామని జనసేన ఇండికేషన్ ఇచ్చింది.

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల జనసేన పోటీ చేయలేదు. అయితే తర్వాత మాత్రం పోటీ చేస్తామని తెలిపింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. ఆయాచోట్ల కమిటీలు వేస్తూ.. క్యాడర్ బలోపేతం చేయడంపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి బరిలోకి దిగుతారని వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చనిపోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
janasena will be contest nagarjuna sagar by poll party said to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X