వామ్మో.. నిమ్మ ధర పైపైకి.. ఒక్కోటి రూ.25 వరకు, తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. వడగాలులు.. దీని నుంచి తప్పించుకోవాలంటే చలువ పదార్థాలు తీసుకోవాలి. అంటే మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ లాంటివి అన్నమాట.. అవును ఇప్పుడు జ్యూస్ పాయింట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే నిమ్మకాయ చలువ.. అందుకే నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటారు. సమ్మర్‌లో దీనికి ఎక్కడ లేని డిమాండ్ కూడా.. సో ఇంకేముంది నిమ్మకాయ ధర పెరిగింది. హై అంటే మాములు కాదు.. ఆకాశాన్ని అంటుతుంది.

నిమ్మకు డిమాండ్

నిమ్మకు డిమాండ్

వేసవిలో నిమ్మకాయలకు డిమాండ్ బాగా ఉంది. దేశంలో నిమ్మ వినియోగం ఎక్కువే. దిగుబడి దండిగా ఉండటంతో కొన్నేళ్ల క్రితం వరకు నిమ్మ ధరలు అందుబాటులో ఉండేవి. ఒక కాయ రూపాయికి కూడా వచ్చేది. 2020లో కరోనా వచ్చిన తర్వాత నిమ్మకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిలో కీలకంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్న వారిని కరోనా వైరస్ ఏమీ చేయదనే ప్రచారం ఎక్కువ మందిలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన పెంచేలా చేసింది. దీంతో నిమ్మ వినియోగం పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా

తెలుగు రాష్ట్రాల్లో ఇలా

తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలు కిలోకు రూ.120-150 వరకు పలుకుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.400 వరకు కిలో పలుకుతుందంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ శాటిలైట్ ప్రాంతంలో ఒక్కో నిమ్మకాయ రూ.25కు పైనే పలుకుతోంది. జోధ్‌పూర్, వస్త్రాపూర్‌లో హోల్ సేల్ కిలో ధర రూ.230 ఉంటే, రిటైల్ ధర రూ.400కు చేరింది. గత వారం వరకు కిలో రూ.130గానే ఉండేది. దేవీ వసంత నవరాత్రులు, రంజాన్ మాసం కావడంతో డిమాండ్ పెరిగిందని చిరు వ్యాపారుల చెబుతున్నారు.

ఇవీ కారణాలు..

ఇవీ కారణాలు..

గతేడాది నవంబర్, డిసెంబర్‌లో వచ్చిన అకాల వర్షాల వల్ల నిమ్మ దిగుబడి దెబ్బతీసింది. దీంతో ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గుజరాత్ లో నిమ్మకాయల సరఫరా కష్టమైపోయిందని.. రోజువారీగా 50 టన్నుల నిమ్మకాయలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అని అహ్మదాబాద్‌లో గల వ్యాపారులు వాపోతున్నారు. రిటైల్ ధరలు మరికొన్ని రోజులు ఆగితే కిలోకు రూ.200కు దిగి రావచ్చని అంచనా వేశారు. అయినప్పటికీ సమ్మర్‌లో నిమ్మ ధరల మోత తప్పదు.

ఎండకు వెళ్లొచ్చిన వారికి ఉపశమనం

ఎండకు వెళ్లొచ్చిన వారికి ఉపశమనం

ఎండకు వెళ్లొచ్చిన.. వడ దెబ్బ తగిలిన వారికి కూడా ఈ నిమ్మ మేలు చేస్తోంది. అలాంటి నిమ్మకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. అదీ కొందరు వ్యాపారులకు వరంగా మారుతుంది. ఎలాగూ కొంటారు కదా అని ఇష్టం వచ్చినరీతిలో విక్రయిస్తున్నారు. జనం కూడా తప్పదు కదా అని తీసుకుంటున్నారు. 4 కావాల్సిన వారు.. 2 తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+