పావలా శ్యామల పాలిట దేవుడు చిరు.. మరో లక్ష సాయం... మాటలు రావడం లేదు
కరోనా వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. జూనియర్ ఆర్టిస్టులు, చిన్న, చితక పనిచేసే వారి సంగతి చెప్పక్కర్లేదు. అయితే మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు నెలకు రూ.6వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో అది అందరికీ వరంగా మారింది. సభ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె సదుపాయాలు ఆదుకుంటున్నాయి.

అప్పుడు రూ.2 లక్షలు
పావల శ్యామల వంటి సీనియర్ నటులు కరోనా సమయంలో ఇబ్బంది పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి తొలుత 2 లక్షలు సాయం చేసిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా సాయం చేశారు. పావల శ్యామల ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారు. ఆమెకు మా తరపున సభ్యత్వ కార్డ్ నిమిత్తంగా మంగళవారం 1,01,500 చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి స్వయంగా అందించారు.

నెలకు రూ.6 వేలు
కొత్త సభ్యురాలైన్ పావలా శ్యామలకు 'మా' మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో 'అందించనుంది. ఎవరైనా ఆర్టిస్ట్ అకాలమరణం చెందితే వారికి 3 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావల శ్యామలను ఆదుకునేందుకు ముందుకొచ్చి 'మా' కార్డు ఇపించే నిమిత్తంగా లక్షా పదిహేను వందల రూపాయలు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ కష్టం తీరింది..
చిరంజీవి 2 లక్షల ఆర్థిక సాయం చేసే సమయంలో ఎంతో కష్టంలో ఉన్నానని పావలా శ్యామల తెలిపారు. కూతురు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి తనదని చెప్పుకొచ్చారు. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం తనను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. ఈ కష్టంలో మరోసారి లక్షా పదిహేను వందల రూపాయలు చెక్ రూపంలో ఇవ్వడం కూడా అంతేనని చెప్పారు. ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications